ఎంవీ యాక్టు 2019ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-05-20T04:39:46+05:30 IST

ఎంవీ యాక్టు 2019ను వెంటనే రద్దుచేయా లని కోరుతూ గురువారం రెబ్బె నలో ఆటోయూనియన్‌ ఆధ్వ ర్యంలో బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి బోగె ఉపేందర్‌ మాట్లాడుతూ ఎంవీ యాక్టు 2019ప్రకారం లేట్‌ ఫిట్నేస్‌, రెనీవల్‌కు రోజుకు రూ. 50 చొప్పున వసూలు చేయటం దారుణమన్నారు. ఈవిషయంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. అనంతరం తహసీ ల్దార్‌ రియాజ్‌అలీకి వినతిపత్రం అందజేశారు

ఎంవీ యాక్టు 2019ను రద్దు చేయాలి
కాగజ్‌నగర్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న ఆటోయూనియన్‌ నాయకులు, తదితరులు

రెబ్బెన, మే 19:ఎంవీ యాక్టు 2019ను వెంటనే రద్దుచేయా లని కోరుతూ గురువారం రెబ్బె నలో ఆటోయూనియన్‌ ఆధ్వ ర్యంలో బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి బోగె ఉపేందర్‌ మాట్లాడుతూ ఎంవీ యాక్టు 2019ప్రకారం లేట్‌ ఫిట్నేస్‌, రెనీవల్‌కు రోజుకు రూ. 50 చొప్పున వసూలు చేయటం దారుణమన్నారు. ఈవిషయంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. అనంతరం తహసీ ల్దార్‌ రియాజ్‌అలీకి వినతిపత్రం అందజేశారు. కార్య క్రమంలో సీపీఐ మండల కార్యదర్శి దుర్గం రవీందర్‌, ఆటోయూనియన్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌జైశ్వాల్‌, వెంకటే శ్వర్లు గౌడ్‌, ఉపాధ్యక్షుడు కృష్ణ, డ్రైవర్లు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఎంవీ యాక్టు 2019ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ గురువారం చేపట్టిన రవాణారంగం కార్మి కుల బంద్‌ విజయవంతం అయింది. ఈ సందర్భంగా పట్టణంలో వివిధ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు ముంజం ఆనంద్‌కుమార్‌, ఆటో యూని యన్‌ నాయకులు అన్ను, ఆదిల్‌, మినిట్యాక్సీ డ్రైవర్లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T04:39:46+05:30 IST