ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి

ABN , First Publish Date - 2020-09-19T09:35:45+05:30 IST

అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములు, పార్కుస్థలాలు, బఫర్‌ జోన్లలలోని భూముల పరిరక్షణకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఉమ్మడి

ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి

ఘట్‌కేసర్‌: అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములు, పార్కుస్థలాలు, బఫర్‌ జోన్లలలోని భూముల పరిరక్షణకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఉమ్మడి మండల అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవంగా తీర్మాణించారు. శుక్రవారం మండలంలోని బంధన్‌ఫంక్షన్‌  హాల్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మాణాలు చేశారు.  ప్రధానంగా ఘట్‌కేసర్‌ మండలంలో అఖిల పక్ష కమిటీ చేసిన పోరాటాలతో అనేక పనులు జరిగాయని గుర్తుచేశారు. ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని చౌదరిగూడ పంచాయతీలో కోట్లు విలువ చేసే ప్రభుత్వభూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు బోర్డు ఏర్పాటు చేయడం అఖిలపక్ష కమిటీ పోరాట ఫలితమే అన్నారు.


అక్రమాలకు అడ్డాగా మారిన ఘట్‌కేసర్‌ సహకార సంఘంలో జరిగిన అక్రమాలపై పలుమార్లు ఆందోళనలు నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చిన అధికారులు పట్టించుకోకపోవడంతో న్యాయస్థానాన్ని అశ్రయించినట్లు వివరించారు. ఇందులో తప్పుచేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని తీర్మాణించారు. కార్యక్రమంలో రాజేష్‌, అమరేందర్‌రెడ్డి, యాదయ్య, సబిత, సృజన, జంగయ్య, ఈశ్వర్‌, జయచంద్ర, సంజీవ గౌడ్‌, సురేందర్‌రెడ్డి, నాగే్‌షపాల్గొన్నారు.


అఖిలపక్ష స్టీరింగ్‌ కమిటీ ఎన్నిక  

ఘట్‌కేసర్‌, మేడిపల్లి మండలాల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం నూతనంగా స్టీరింగ్‌ కమిటీని ఎంపిక చేశారు. పార్టీకి ఇద్దరి చొప్పున సభ్యులను ఎనుకున్నారు. ఇందులో పదవులకు తావులేదని అందరూ సమానంగా పనిచేయాలని తీర్మాణించారు. 

Updated Date - 2020-09-19T09:35:45+05:30 IST