నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయం

ABN , First Publish Date - 2022-07-08T04:37:37+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి చైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు.

నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయం
లింగాపూర్‌లో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న రావుల శ్రీధర్‌రెడ్డి

- రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి చైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి 

లింగాపూర్‌, జూలై 7: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి చైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు.  మండలంలోని కాంచన్‌పల్లి గ్రామ పంచాయతీ లోని ఘుమ్నూర్‌(కె) ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మన ఊరు- మన బడి కార్యక్రమం లో ఘుమ్నూర్‌(కె) పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ సవిత, వైస్‌ ఎంపీపీ ఆత్మారాం, టీఎస్‌ఈవైఐడీసీ అశోక్‌కుమార్‌, డిప్యూటీ ఈఈ శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌ జ్యోతిరాం, కో ఆప్షన్‌ షేక్‌ సలీం, ఎంఈవో సుధాకర్‌, నాయకులు అనీల్‌కుమార్‌, శేషు, తదితరులు పాల్గొన్నారు. 

సిర్పూర్‌(యూ): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి చైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు.   మండల కేంద్రంలోని ఎంపీపీ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు, నిర్మాణంలో ఉన్న గదులు, నీటి ట్యాంక్‌లు, వంట గదులు పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో జైనూ ర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మి, వైస్‌ ఎంపీపీ ఆత్రం ప్రకాష్‌, సర్పంచులు మెస్రం భూపతి, ఆర్క హిరాబాయి, ఎంఈవో కుడ్మేత సుధాకార్‌, తోడసం శ్నీనివాస్‌, పీఏసీ చైర్మన్‌ కేంద్రే శివాజీ, వీటీడీఏ చైర్మన్‌  కుమ్ర భీంరావు, ఉపాధ్యాయుడు ఆంధ్రయ్య తదితరులు పాల్గొన్నారు.       

Updated Date - 2022-07-08T04:37:37+05:30 IST