పొలంలో కనిపించిన ప్రేమ జంట.. పట్టుకుని కొట్టి పెళ్లి చేసిన గ్రామస్తులు.. ఆమె తన కంటే రెండేళ్లు పెద్దయినా..

ABN , First Publish Date - 2022-06-22T20:46:04+05:30 IST

ఆ యువతీయువకులిద్దరూ రాంగ్ నెంబర్ ద్వారా కనెక్ట్ అయ్యారు.. మాటా మాటా కలిసి స్నేహం చిగురించింది..

పొలంలో కనిపించిన ప్రేమ జంట.. పట్టుకుని కొట్టి పెళ్లి చేసిన గ్రామస్తులు.. ఆమె తన కంటే రెండేళ్లు పెద్దయినా..

ఆ యువతీయువకులిద్దరూ రాంగ్ నెంబర్ ద్వారా కనెక్ట్ అయ్యారు.. మాటా మాటా కలిసి స్నేహం చిగురించింది.. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది.. ఆ తర్వాత ఇద్దరూ రహస్యంగా కలుసుకోవడం మొదలుపెట్టారు.. ఈ నెల 18న ఇద్దరూ యువతి గ్రామంలోని పొలాల్లో కలుసుకున్నారు.. అయితే కొందరు గ్రామస్తులు వారిని చూసి  పట్టుకున్నారు.. యువతిని గుర్తుపట్టి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడిని కొట్టి బలవంతంగా పెళ్లి చేసేశారు. 


ఇది కూడా చదవండి..

వీళ్లసలు తల్లిదండ్రులేనా..? మద్యం కొనుక్కునేందుకు డబ్బుల్లేక 2 నెలల కొడుకును రూ.30 వేలకు అమ్మేశారు..!


బీహార్‌లోని బెట్టియాకు చెందిన నీరజ్ కుమార్ (20), సుమన్ కుమారి (22) రాంగ్ నెంబర్ ద్వారా కనెక్ట్ అయ్యారు. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మొగ్గ తొడిగింది. ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు. ఈ నెల 18న కూడా అలాగే కలుసుకోవాలనుకున్నారు. యువతి గ్రామ శివార్లలోని పొల్లాలో కలుసుకున్నారు. అయితే కొందరు గ్రామస్తులు వారిని చూసి పట్టుకున్నారు. యువతిని గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడిని కొట్టారు. 


అనంతరం యువతి కుటుంబ సభ్యులు వారిద్దరినీ గ్రామంలోని రామజానకి ఆలయానికి తీసుకెళ్లి పెళ్లి చేశారు. విశేషమేంటంటే.. ఆ యువతి తన ప్రియుడి కంటే రెండేళ్లు పెద్దది. ఆ ఘటన మొత్తాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

Updated Date - 2022-06-22T20:46:04+05:30 IST