లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలు

ABN , First Publish Date - 2020-03-29T10:04:52+05:30 IST

కరోనా నివారణను అరికట్టడానికి లాక్‌డౌన్‌ను మరింత పటిష్ఠంగా అమలు చేస్తున్నామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.

లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలు

ఎన్‌వోసీలు ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి రానివ్వం

 ప్రజలందరూ సహకరించాలి

 టెక్నాలజీతో కరోనా ట్రాకింగ్‌ యాప్‌ను డెవలప్‌ చేశాం

 విదేశాల నుంచి 945 మంది జిల్లాకు వచ్చినట్లు సమాచారం

 53 రైతుబజార్లను ప్రారంభించాం : ఎస్పీ ఫక్కీరప్ప

 మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌస్‌ పంపిణీ 


కర్నూలు, మార్చి 28: కరోనా నివారణను అరికట్టడానికి లాక్‌డౌన్‌ను మరింత పటిష్ఠంగా అమలు చేస్తున్నామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. నగరంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయం కొండారెడ్డి బురుజు దగ్గర వనమాలి గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాస్క్‌లు, శానిటైజర్స్‌, గ్లౌస్‌ పంపిణీ కార్యక్రమానికి ఎస్పీ ఫక్కీరప్ప ముఖ్యఅతిథిగా హాజరై వాటిని పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర సరుకుల నిమిత్తం బైకులో ఒకరే వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసర మెడికల్‌ దుకాణాల వద్దకు అను మతి ఇస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరినీ అనుమతించబోమని తెలిపారు. ఇటీవల విదేశాల నుంచి 945 మంది జిల్లాకు వచ్చినట్లు సమాచారం ఉందని,  వారందరిని హోం క్వారం టైన్‌కి పంపించామని తెలిపారు. ప్రతి రోజు ఏఎన్‌ఎంలు, పోలీసు అధికా రులు ఆయా హోం క్వారంటైన్‌లకు వెళ్లి వారు క్వారంటైన్‌ను పాటిస్తున్నారా? లేదా? అని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. టెక్నాలజీతో కరోనా ట్రాకింగ్‌ యాప్‌ను కూడా డెవలప్‌ చేశామన్నారు.


విదేశాల నుంచి వచ్చిన 945 మందికి మొబైల్‌ ఫోన్లలోలో కరోనా ట్రాకింగ్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేశా మని తెలిపారు. హౌస్‌ క్వారంటైన్‌ నుంచి ఎవరైనా బయటకు వచ్చారంటే జిల్లా కమాండ్‌ కంట్రోల్‌రూముకి మెసేజ్‌ వస్తుందని తెలిపారు. ఇంటి నుంచి ఎంత దూరం వెళ్లారు.. అనేది కూడా జీపీఎస్‌ సిస్టం ద్వారా తెలుస్తుంద న్నారు. 722 మంది కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ఏపీ, కర్నూలు జిల్లా సరిహద్దుకు వచ్చారని, మన జిల్లాలోకి రానివ్వకుండా వారు వచ్చిన ప్రాంతాలకే తిరిగి పంపించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నిబంధనలను ఉల్లంఘించిన 112 మందిని పట్టుకుని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామ న్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యావసర సరుకులు, కూరగాయల నిమిత్తం 53 రైతుబజార్లను ప్రారంభించామని తెలిపారు.


కర్నూలు నగరంలో 20 రైతుబజార్లు, ఆదోనిలో 5, నంద్యాలలో 10 రైతుబజార్లు తదితర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేశామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. వ్యక్తుల మధ్య కనీసం దూరం పాటించే విధంగా రౌండ్‌గా మార్కింగ్‌లు కూడా వేసినట్లు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 47 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. 164 మం దిని కస్టడిలోకి తీసుకున్నామన్నారు. ఎంవీఐ యాక్టు కింద 7 లక్షల వరకు జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు కంటైనర్‌ల ద్వారా బార్డర్‌ చెక్‌పోస్టులను దాటి వస్తున్నారని, ఆ కంటైనర్లను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేసి తిరిగి వచ్చిన రాష్ట్రానికే పంపిస్తున్నామన్నారు. కర్ణాటక, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన హాస్పిటల్స్‌ నుంచి ఎన్‌వోసీలు తీసుకొచ్చినా జిల్లాలోకి అనుమతిం చబోమన్నారు.


ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి వంద పడకల చొప్పున ఒక క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, 8 క్వారంటైన్‌ కేంద్రాలను పోలీసు భద్రతా ఏర్పాటు చేసి ఇది వరకే ప్రారంభించామని తెలిపారు. ఇళ్ల నుంచి బయటకి రావద్దని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, సహకరించాలని కోరారు. అత్యవసరమైతేనే 2 కి.మీ.ల పరిధి వరకు ఒక్కరు మాత్రమే బయటికి రావాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. కర్నూలు నగరంలో ప్రతి వస్తువును జొమేటో, స్విగ్గీ ద్వారా డోర్‌ డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.


పదవీ విరమణ పొందిన పోలీసు, ఆర్మీ, పారా మిలిటరీ, వలంటీర్ల సేవలను వినియోగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ రాధాకృష్ణ, వనమాలి గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాఘవేంద్ర పోరల్‌, శ్రీనివాసులు, రంగ, డా.మన్సూర్‌ బాషా, డా.శ్రావణ్‌కుమార్‌, పీఏ నాగరాజు, ఈకాప్స్‌ ఇన్‌చార్జి రాఘవరెడ్డి, ఆర్‌ఐలు రామకృష్ణ, శివారెడ్డి, పోలీసు సంఘం అధ్యక్షుడు నాగరాజు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-29T10:04:52+05:30 IST