భూములు కోల్పోయిన పరిహారం అందలేదు

ABN , First Publish Date - 2022-01-22T04:27:11+05:30 IST

ఖమ్మం టు దేవరపల్లి వరకు విస్తరించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో భూములు కొల్పోయిన అర్హుల జాబితాలో చేర్చకపోవటంతో పరిహారం అందలేదని కల్లూరు మండలంలోని ముగ్గువెంకటాపురం గ్రామానికి చెందన పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

భూములు కోల్పోయిన పరిహారం అందలేదు

 ముగ్గువెంకటాపురం రైతులు ఆవేదన

కల్లూరు, జనవరి 21: ఖమ్మం టు దేవరపల్లి వరకు విస్తరించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో భూములు కొల్పోయిన అర్హుల జాబితాలో చేర్చకపోవటంతో పరిహారం అందలేదని కల్లూరు మండలంలోని ముగ్గువెంకటాపురం గ్రామానికి చెందన పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం బాధిత రైతుల తరుపున ఆ గ్రామ సర్పంచ్‌ కువ్వారపు విజయరావు ఆర్డీవో సూర్యనారాయణను కలిశారు. తమ గ్రామంలో సర్వే నెం 351/1 ప్రకారం కువ్వారపు తులశమ్మ, మల్లాది జయరావు, కువ్వారపు జయమ్మ,లతో పాటుగా పలువురు 40 సంవత్సరాల క్రితం నుంచి తమ భూములను సాగు చేసుకుంటున్నారని ఆ గ్రామానికి చెందిన భాధిత రైతులు, సర్పంచ్‌ తెలిపారు. సదరు భూములను ఇటీవల గ్రీన్‌ఫ్డీల్డ్‌ హైవేలో రెవెన్యూ అధికారులు సేకరించారని వారు వివరించారు. దీంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వం తరుపున పరిహారం అందించేందుకు రూపొందించిన జాబితాలో తమ పేర్లను చేర్చలేదని బాధిత రైతులు పేర్కొన్నారు. ఇలా తమ గ్రామంలో చాల మంది రైతులకు పరిహారం బ్యాంకు ఖాతాల్ల జమ కావటంతో వాస్తవ విషయం వెలుగులోకి వచ్చిందని వివరించారు. ఈ విషయమై తాము గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూసేకణ అధికారిని కూడ కలుసుకొని తమకు జరిగిన ఆన్యాయం గురించి వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. అదే విధంగా ముగ్గువెంకటపురం గ్రామంలో రైతులకు సంబంధించిన ఆయకట్టు రహదారుల భూములు కూడ కోల్పోవటం జరిగిందని వాటికి కూడ పరిహరం గ్రామ పంచాయితీకి అందించాలని సర్పంచి విజయరావు అధికారులను కోరారు. 

భూసేకరణ అధికారిదే బాధ్యత: ఆర్డీవో

గీన్‌ఫీల్డ్‌ హైవేలో భూములు కొల్పోయి పరిహరం అందని వారు  జిల్లా భూసేకణ అధికారికి ఫిర్యాదులు చేశారని, ఈ సమస్య పరిష్కారం వారి పరిధిలో ఉందని తెలిపారు. పై స్థాయిలో తమకు స్పష్టమైన ఆదేశాలు రాగానే ఆ భూములపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి తగిన విధంగా బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 


Updated Date - 2022-01-22T04:27:11+05:30 IST