Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రంలో మిల్లర్ల రాజ్యం నడుస్తోంది

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 

సారంగాపూర్‌, డిసెంబరు 2 : రైతు రాజ్యం నడవాల్సింది పోయి రాష్ట్రంలో మిల్లర్ల రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్‌ మండలంలోని అర్ప పల్లి, నాయకపుగూడెం గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులతో కలిసి జీవన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈసంధర్బంగా ఆయన మాట్లాడుతూ మిల్లర్ల చేతిలో ప్రభుత్వం బంధీ అయిపోయిందని అన్నారు. అర్పపల్లిలో ఐదు రోజుల నుంచి లారీలు రాక తూకం నిలిచి పోవడంతో హమాలీలకు పని లేక వెళ్లిపోయారని ఈ విష యం రైతులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకు రావడంతో సంబంధిత అధికారులతో ఎమ్మెల్సీ ఫోన్‌లో మాట్లాడారు. 40 కిలోల బరువుతో ధాన్యం బస్తాలు మిల్లులకు వెళితే ధాన్యం దించుకోవడానికి స్థలం లేదని నిరాకరిస్తున్నారని 43 కిలోల బరువుతో బస్తాలను తరలి స్తే మిల్లులో దించుకుంటామని మిల్లర్లు చెబుతున్నారని 43 కిలోల బస్తాలకు మిల్లులో స్థలం ఎక్కడ నుంచివచ్చిందని ప్రశ్నించారు. మిల్లర్లు రైతులను ఇంత దోపిడీ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో మొదటి  నుం చిమొక్క జొన్న పంట వేసే రైతులు 25శాతం ఉన్నారని ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించక పోవడంతోనే మొక్కజొన్న రైతులు వరివైపు మళ్లారని తెలి పారు. వరి వద్దంటున్నప్పుడు మిగిలిన పంటలకు ఎంఎస్‌పీ ప్రకటించి రైతులను పోత్సహించాలని  సూచించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కోండ్ర రాంచందర్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ బేతీ పూర్ణచందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ న్యారబోయిన గంగాధర్‌, నాయకులు గంగారెడ్డి, లింగారెడ్డి, లక్ష్మారెడ్డి, అంజిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మధు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement