Advertisement
Advertisement
Abn logo
Advertisement

నరకప్రయాణం

  • బీటీ రోడ్డుకు రూ1.15కోట్లు మంజూరు.. పూర్తికాని పనులు!
  • దామర్‌చెడ్‌-వాల్యానాయక్‌ మధ్య కంకర రోడ్డు
బషీరాబాద్‌: దామర్‌చెడ్‌-వాల్యానాయక్‌ తండాకు రూ.కోటీ15లక్షలు మం జూరు కాగా బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్‌ కంకర వేసి వదిలేశారు. కొన్ని చోట్ల కల్వర్టులూ నిర్మించారు. కంకర వేసి ఏడాదిన్నర కాగా ఇంకా బీటీ వేయలేదు. రెండున్నర కిలోమీటర్ల మేరపూర్తిగా కంకర తేలి తండావాసులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. వాహనాలు నడవడం అటుంచితే కాలినడకనా వెళ్లలేని విధంగా రోడ్డు మారింది. కంకర రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బీటీ రోడ్డు కోసం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దృష్టికి తీస్కెళ్లామని సర్పంచ్‌ శివ్యానాయక్‌ తెలిపారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్‌ అధికారులు స్పందించి బీటీ రోడ్డు పూర్తిచేయించాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement