Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరం

జనాగ్రహ దీక్షలో ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అమర్‌


అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 22: సీఎం జగన్మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎంపీ డాక్టర్‌ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా నెహ్రూచౌక్‌లో చేపట్టిన జనాగ్రహ దీక్షకు రెండో రోజు శుక్రవారం వారు హాజరై మాట్లాడారు. ప్రతిపక్షాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జరిగిన గుణపాఠం జీర్ణించుకోలేక సీఎంపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. సీఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగా లక్ష్మి, జడ్పీటీసీ దంతులూరి శ్రీధర్‌రాజు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, నాయకులు మలసాల కిశోర్‌, పలకా రవి, జాజుల రమేశ్‌, బుదిరెడ్డి చిన్న, మహిళా నాయకులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement