Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి

తంగళ్లపల్లి, డిసెంబరు 4: కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరతగతిన మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. శనివారం తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లె, తంగళ్లపల్లి గ్రామాల్లోని  ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా  చూసుకోవాలని సూచించారు.  క్షేత్ర స్థాయిలో ఇబ్బందులుంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూసుకోవా లన్నారు.  అనంతరం వచ్చే సీజన్‌లో సాగు చేసే పంటలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.  కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి  జితేందర్‌రెడ్డి, ఎంపీడీవో లచ్చాలు, డిప్యూటీ తహసీల్దార్‌ ఎలుసాని ప్రవీణ్‌, ఎపీఏం పర్శరాములు తదితరులు ఉన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు లేకుండా చర్యలు

ఇల్లంతకుంట : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్‌ బావ్‌సింగ్‌ అన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్‌లోని  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.  ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు.   సర్పంచ్‌ గొడిశెల జితేందర్‌గౌడ్‌, ఫ్యాక్స్‌ డైరెక్టర్‌ గన్నారం వసంతనర్సయ్య, నాయకులు మీసరగండ్ల అనీల్‌కుమార్‌, అశోక్‌, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement