ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-27T04:33:53+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. గురువారం కలెక్టరే ట్‌లో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి సంబంధిత అధికారులు, కొనుగోలు ఏజెన్సీలు, రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం ప్రక్రి యను వేగవంతం చేయాలని, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు వివరాల ను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో నమోదు చేయాల న్నారు. రైతులకు ధాన్యం సంబంధిత డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 26: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. గురువారం కలెక్టరే ట్‌లో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి సంబంధిత అధికారులు, కొనుగోలు ఏజెన్సీలు, రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం ప్రక్రి యను వేగవంతం చేయాలని, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు వివరాల ను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో నమోదు చేయాల న్నారు. రైతులకు ధాన్యం సంబంధిత డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. జిల్లాలో 34 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సామర్ధ్యం గల గోదా ములను మధ్యంతర గిడ్డంగులుగా గుర్తించి సంబం ధిత కొనుగోలు ఏజెన్సీలతో ధాన్యం దిగుమతి చేస్తా మని తెలిపారు.  మధ్యంతర గిడ్డంగులతోపాటు కేటా యించిన రైసుమిల్లర్లు దిగుమతి ప్రక్రియను వేగ వంతం చేయాలన్నారు.

రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి 

వేమనపల్లి: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం వేమనపల్లి, మంగె నపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సం దర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేం ద్రాల్లో రైతులకు అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, దళారులను నమ్మి రైతులు మోసపోవ ద్దని సూచించారు. లారీలు సక్రమంగా రావడం లేదని రైతులు ఎమ్మెల్యేకు తెలుపగా ఆయన కలెక్టర్‌, బెల్లంపల్లి ఆర్డీవోలతో ఫోన్‌లో మాట్లాడారు. లారీలను వెంట వెంటనే పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేమనపల్లి సర్పంచు కుడిడె మధూకర్‌ గృహ ప్రవేశానికి, జాజులపేటలో టీఆర్‌ఎస్‌ నాయకుడు కుబిడె శేఖర్‌ వివాహానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌ రావు, ఎంపీపీ ఆత్రం గణపతి, రైతు కోఆర్డినేటర్‌ భీమన్న, సర్పంచులు మధుకర్‌, శంకర్‌గౌడ్‌, పద్మ, బాపు, రాజేశ్వరి, కొండల్‌రెడ్డి, నాయకులు లక్ష్మీకాంత్‌, వెంకటేష్‌, లక్ష్మణ్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-27T04:33:53+05:30 IST