గుండ్లకమ్మ ఆయ‘కట్‌’

ABN , First Publish Date - 2020-07-09T10:25:17+05:30 IST

జిల్లాలో ప్రధాన నీటివనరైన గుండ్ల కమ్మ ప్రాజెక్టు కింద పూర్తి ఆయకట్టుకు నీరివ్వడం కలగానే మిగిలేలా ఉంది. రెండు సీజన్లలో కలిపి

గుండ్లకమ్మ ఆయ‘కట్‌’

అగమ్యగోచరంగా 11,500 ఎకరాల పరిస్థితి  

భూసేకరణ వివాదంతో నిలిచిన ఎడమ కాలువ పనులు 

ఇంకా ఎదురుచూడలేమన్న కాంట్రాక్టు ఏజెన్సీ 

వైదొలిగేందుకు అనుమతించిన ప్రభుత్వం

వెలిగొండ-2 ప్యాకేజీ సంస్థకూ వెసులుబాటు 


గుండ్లకమ్మకు కష్టాలు వీడటం లేదు.  ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రాజెక్టు పరిధిలోని ఎడమ కాలువ ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ కెనాల్‌ చివర ప్రాంతంలో ఉన్న ఆయకట్టుకు నీరిచ్చేందుకు అవసరమైన కాలువల తవ్వకం పనులు, భూసేకరణ వివాదంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే పదేళ్లు గడిచినా ఆ పనులు చేసే అవకాశం లేని పరిస్థితుల్లో తాము ఇంకా వాటికోసం ఎదురుచూడలేమని ప్రాజెక్టు కాంట్రాక్టు నుంచి వైదొలిగేందుకు అనుమతించాలని ఏజెన్సీ కోరింది. అందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో చివరి ప్రాంతంలోని 11,500 ఎకరాల ఆయకట్టు భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో వెలిగొండ-2 ప్యాకేజీ పెండింగ్‌ పనుల నుంచి వైదొలిగేందుకు ఆ పనులు చేసిన ఏజెన్సీకి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలా వెసులుబాటు ఇవ్వటం వల్ల నిలిచిపోనున్న పనుల విలువ రూ. 25కోట్ల వరకూ ఉంటుంది. కాగా తాజా నిర్ణయంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద పూర్తి ఆయకట్టుకు ఇప్పట్లో నీరందే అవకాశం లేకుండా పోయింది.


ఒంగోలు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధాన నీటివనరైన గుండ్ల కమ్మ ప్రాజెక్టు కింద పూర్తి ఆయకట్టుకు నీరివ్వడం కలగానే మిగిలేలా ఉంది. రెండు సీజన్లలో కలిపి 80,060ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇచ్చేం దుకు ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. కుడికాలువ పరిధిలో 28వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాలువ పరిధిలో సుమారు 52వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిర్మా టణానికి 2004-05లో ఎన్‌సీసీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా 2009 ఎన్నికలకు ముందే అధిక పనులు పూర్తై అధికారికంగా ప్రాజెక్టును ప్రారంభించిన విషయం విదితమే. అనంతరం పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తికాక ఏ ఒక్క ఏడాదీ పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీటిని ఇవ్వలేక పోయారు.


కాగా కుడి కాలువ పరిధిలో 28వేల ఎకరాలకు సంబంధించిన పనులు పూర్తికాగా, ఎడమకాలువ పరిధిలో 18ఆర్‌ దగ్గర భూసేకరణ వివాదంలో పడింది. దుద్దుకూరు వద్ద 19ఎకరాలలో భూసేకరణ కోర్టు వివాదంలో చిక్కుకోగా కాలువ తవ్వకం వీలు కాలేదు. దిగువన దుద్దుకూరు, మద్దిరాల, ముప్పాళ్ల, ఈదుమూడి తదితర గ్రామాల్లో 11,500 ఎకరాల ఆయకట్టు ఉంది. దశాబ్దకాలంగా భూ సేకరణ వివాదం నడుస్తోంది. ఇప్పటికీ అదే పరిస్థితి ఉండగా మరోవైపు కనపర్తి ఎత్తిపోతలను గుండ్లక మ్మ ఆయకట్టులో చేర్చడాన్ని అక్కడి రైతులు వ్యతి రేకిస్తుండటంతో ఆ పరిధిలోని పనులు ముందుకు సాగలేదు. 


జిల్లాలో రెండు పనులు రద్దు

వివాదాలతో ఏళ్ల తరబడి అనేక ప్రాజెక్టుల పరిధిలోని పనులు పెండింగ్‌లో ఉన్నాయి.  దీంతో పలు ఇబ్బందులు పడాల్సి వస్తున్న దని పెండింగ్‌ పనులను అలా ఉంచి చేసిన పనులు వరకు సెటిల్‌ చేయాలని ఆయా ప్రాజెక్టుల పనులు చేపట్టిన ఏజెన్సీలు ప్రభుత్వాన్ని కోరడంతో అలాంటి వాటిపై ప్రభుత్వ ఆదేశాలతో జలవనరులశాఖ అధికారులు సమగ్ర సర్వే చేసి నివేదించారు. అలా 223 పనులు రద్దుచేసి కాంట్రాక్టు ఏజెన్సీలకు మోక్షం కల్పించేందుకు అధికా రులు ప్రతిపాదించారు. అందులో 198పనుల నుంచి తప్పుకోవడానికి ఏజె న్సీలకు ప్రభుత్వం అనుమతించింది. అందులో రెండు జిల్లాలో ఉన్నాయి.


వాటిలో  గుండ్లకమ్మ ఒకటి కాగా భూసేకరణ వివాదం పరిష్కారంలో నెలకొన్న పరిస్థితులతో ఎడమ కాలువ, రైతుల వ్యతిరేకతతో  కనపర్తి ఎత్తిపోతల ప్రాంతంలో పనులు జరగలేదని, ఇందులో ఏజెన్సీ లోపం లేనందువల్ల ఆ పనులు నుంచి  వైదొలగేందుకు ప్రభుత్వం కాంట్రాక్టు ఏజెన్సీ  అనుమతి ఇచ్చింది. అలాగే  గొట్టిపడియ గ్యాప్‌తో పాటు ఆ పరి ధిలోని ప్రధాన కాలువల పనులు పూర్తయ్యాయి. కేవలం పంట కాలువలు పనులు మాత్రం ఉండగా వెలిగొండ రిజర్వాయర్‌లోకి నీరు వచ్చేలోపు పంటకాలువలు తవ్వినా రైతులు తిరిగి పూడ్చే అవకాశం ఉందని గుర్తించి పనులు నుంచి సదరు ఏజెన్సీకి వెసులుబాటును ప్రభుత్వం ఇచ్చింది. 


ఆయకట్టులో అయోమయం

ప్రభుత్వ నిర్ణయం వల్ల గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో 11,500ఎకరాల ఆయక ట్టుకు సాగునీరు అందకుండా పోయింది. ఇప్పటివరకు ఏఐబీపీ పథకం కింద జపాన్‌ సహకారంతో నిధులు వస్తుం డగా ప్రస్తుతం చర్యలతో ఇక పథకం పరిధి నుంచి ప్రాజెక్టును మినహా యిస్తారు. భవిష్యత్‌లో తిరిగి పెండింగ్‌  పనులు పూర్తిచేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు ఇవ్వాలి. అంతేకాక భూసేకరణ వివాద పరిష్కారంపై అంత చొరవ ఉండదు. దీనిపై ప్రాజెక్టుల ఎస్‌ఈ ఎం.నగేష్‌ స్పందిస్తూ ప్రస్తుత నిర్ణ యంతో పనులు పూర్తిగా రద్దుకానున్నాయి.


రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల పరిధి లో దీర్ఘకాలంగా కొద్దిపాటి పనులు అనేక కారణలతో జాప్యం కాగా కాంట్రాక్టు ఏజె న్సీలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కుందన్నారు. ఇతర జిల్లాల్లో అనేక పనులు ఇలానే ఉన్నాయన్నారు. గుండ్లకమ్మ ఆయ కట్టుపై స్పందిస్తూ త్వరితగతిన భూసేకరణ సమస్య పరిష్కరించి ఆ దిగువ ఆయకట్టుకు నీరిచ్చేందుకు మరో కొత్త ఏజెన్సీ ద్వారా పనులు చేపిస్తామన్నారు. అలాగే వెలిగొండ రిజ ర్వాయర్‌లోకి నీరు వచ్చాక అయితే పంట కాలువల తవ్వడానికి రైతుల నుంచి సహకారం సంపూర్ణంగా అందుతుందని, అప్పుడు పనులు చేస్తామన్నారు.  

Updated Date - 2020-07-09T10:25:17+05:30 IST