Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించాలి

కల్హేర్‌లో నిర్వహించిన బీజేపీ ఎడ్ల బండి ర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేస్తున్న జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి 

పలు ప్రాంతాల్లో ఎండ్ల బండి ర్యాలీతో నిరసన

కల్హేర్‌, నవంబరు 30 : పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను తక్షణమే తగ్గించాలని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే ఎం.విజయపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలో ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ట్యాక్స్‌ను తగ్గించడంతో లీటరుకు రూ.5 ధర తగ్గిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ను తగ్గిస్తే ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. గతంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయని కేంద్రంపై ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్‌, కేంద్రం ధరలు తగ్గించడంతో ఏం చేయాలో తెలియక, హుజూరాబాద్‌ ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు ధాన్యం కొనుగోళ్ల మీద పడ్డారని ఆరోపించారు. ఈ నిరసన ర్యాలీలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, ఖేడ్‌ పట్టణ అధ్యక్షుడు పత్తిరి రామకృష్ణ, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మాజీ అఽధ్యక్షుడు బేతయ్య, బీజేపీ, బీజేవైఎం, భజరంగ్‌దళ్‌ నాయకులు పాల్గొన్నారు. 

జహీరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని మొగుడంపల్లి మండల కేంద్రంలో బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఎడ్ల బండిపై కూర్చొని వెళ్తూ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివా్‌సగౌడ్‌,  బీజేపీ నాయకులు జగన్నాఽథం, సురేష్‌, వెంకట్‌, శ్రీకాంత్‌, రాజు, చంద్రకాంత్‌ పాల్గొన్నారు.

కొండాపూర్‌: బీజేపీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కొండాపూర్‌ మండలంలో ఆ పార్టీ నాయకులు ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఆకుల సాయికుమార్‌, జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యక్క, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య పాల్గొన్నారు.

మెదక్‌ జిల్లాలో

హవేళీఘణపూర్‌, నవంబరు 30 : రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వేస్తున్న ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని బీజేపీ మండలాధ్యక్షుడు రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నయాబ్‌ తహసీల్దార్‌ నవీన్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాంచంద్రం, ఎంఎల్‌ఎన్‌ రెడ్డి, నవీన్‌, అశోక్‌, నాగరాజు, రమేష్‌ పాల్గొన్నారు. 

నిజాంపేట : రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై విధించే వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో నిజాంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలపై వ్యాట్‌ను తొలగించి వినియోగదారులకు భారాన్ని తగ్గించాలన్నారు.

వెల్దుర్తి : పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వెల్దుర్తి మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్‌, పార్టీ మండలాధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. నాయకులు జనార్ధన్‌రెడ్డి, నర్సింహులు ఉన్నారు. 

నిజాంపేట మండలంలో రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు


Advertisement
Advertisement