హరితహారం పేరుతో భూములను లాక్కుంటున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-08-05T05:01:14+05:30 IST

హరితహారం పేరుతో రైతులు సాగు చేసుకుంటున్న భూములను కేసీఆర్‌ ప్రభుత్వం లాక్కుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

హరితహారం పేరుతో భూములను లాక్కుంటున్న ప్రభుత్వం
పోడుయాత్రను ప్రారంభిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి 

- జోడేఘాట్‌ నుంచి పోడు యాత్ర ప్రారంభం

కెరమెరి, ఆగస్టు 4: హరితహారం పేరుతో రైతులు సాగు చేసుకుంటున్న భూములను కేసీఆర్‌ ప్రభుత్వం లాక్కుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని జోడేఘా ట్‌ నుంచి పోడు భూముల పోరు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన, దళిత, బహుజన రైతులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను హరితహారం పేరిట లాక్కుం టోందన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు, కేసీఆర్‌ ప్రజావ్యతిరేక పాలనకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక పాలనతో కుమరం భీం పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోడు భూములు సాగు చేసు కుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇస్తా మని చెప్పిన కేసీఆర్‌ ఆ తరువాత రైతులపై పీడీ యాక్టులు నమో దు చేయడం ఎంత వరకు సమంజసమ న్నారు. భూస్వామ్య వ్యవస్థను తొలగించి దున్నేవాడికే హక్కు పత్రాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆక్రమిం చుకున్న భూములను బయటపెట్టిన ప్రభుత్వం ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఆక్ర మించిన భూములను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు మల్లేష్‌, కళవేణి శంకర్‌, బద్రి సత్యనా రాయణ, విలాస్‌, కాంతయ్య, ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-05T05:01:14+05:30 IST