కుల వృత్తులకు ప్రభుత్వం పెద్ద పీట

ABN , First Publish Date - 2021-03-01T06:29:02+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి, కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.

కుల వృత్తులకు ప్రభుత్వం పెద్ద పీట
కార్యక్రమంలో మాట్లాడుతున్న మం త్రి జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి 

సూర్యాపేటటౌన్‌, ఫిబ్రవరి 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి, కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మశాలి భవనంలో ఆదివారం జరిగిన టైలర్స్‌ డేలో పాల్గొని మాట్లాడారు. ప్రపంచానికి నాగరికత నేర్పింది భారతదేశమయితే కుట్లు, అల్లికల ద్వారా మానవునికి నాగరికత నేర్పింది దర్జీలేనన్నారు. త్వరలో దర్జీలకు పలు సంక్షేమ పథకాలు అందించడంతో వారి ఆర్థిక స్థితిని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతకుముందు చేనేత మిషన్లలో పడి గాయపడిన మెతుకు లక్ష్మణ్‌కు లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు గండూరి కృపాకర్‌ ఆధ్వర్యంలో మంత్రి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాదేవిఆనంద్‌, కేవీయల్‌, దూలం నగేష్‌, గండూరి కృపాకర్‌, సిద్దప్ప, ఉపేందర్‌, రావుల రామచంద్రు, పాండురంగచారి, శ్రీనివాస్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి

ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో జరిగిన ఆర్యవైశ్య సంఘం పట్టణ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి మాట్లాడారు. ప్రజా సేవలో ఆర్యవైశ్యులు ముందుంటున్నారని గుర్తుచేశారు. ఆర్యవైశ్యులు ఐక్యమత్యంగా ఉండి సంఘం బలోపేతానికి సహకరించుకోవాలన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షుడిగా మంచాల రంగయ్యతో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాదేవిఆనంద్‌, గండూరి కృపాకర్‌, మీలా మహాదేవ్‌, మీలా వంశీ, రాజశేఖర్‌గుప్తా, అనంతరాములు, కక్కిరేణి శ్రీనివాస్‌, బండారు రాజా, వెంపటి రమేష్‌, మొరిశెట్టి శ్రీనివాస్‌, అశోక్‌, శ్యాం, మురళీదర్‌, బుచ్చయ్య, సుమన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:29:02+05:30 IST