భూములు లాక్కునే హక్కు ప్రభుత్వానికి లేదు

ABN , First Publish Date - 2021-10-21T05:51:37+05:30 IST

బెదిరించి భూములు లాక్కునే హక్కు ప్రభుత్వానికి లేదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు.

భూములు లాక్కునే హక్కు ప్రభుత్వానికి లేదు
జగదేవ్‌పేటలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కోదండరాం

- తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం

వెల్గటూర్‌, అక్టోబరు 20: బెదిరించి భూములు లాక్కునే హక్కు ప్రభుత్వానికి లేదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం జగదేవ్‌పేటలో జగదేవ్‌పేట, కొండాపూర్‌, చందో ళి, లక్ష్మీపూర్‌, దమ్మన్నపేట, చెర్లలపెల్లి గ్రామాల రైతులు నిర్వహించిన రైతుల సమా వేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రైతుల భూముల నుంచిఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పైప్‌లైన్‌ పనులను కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో కలిసి పరిశీలించారు. కాళేశ్వరం లింక్‌ 2 పైప్‌ లైన్‌ నిర్మా ణంతో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమయ్యారు. రైతుల నుంచి వాస్త వాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో వచ్చిన చట్టం ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వక పోతే భూములు గుంజు కునే హక్కు గానీ, రైతులు వద్దంటే ప్రాజెక్టులు నిర్మించే హక్కు గానీ ప్రభుత్వాలకు లేదన్నారు. రైతుల సమ్మతితో ప్రభుత్వం మార్కెట్‌ రేటుకు మూడు రెట్లు ధర చెల్లించి రైతుల నుంచిభూమి పొందిన తరువాతనే ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాజెక్టులు గానీ పైప్‌ లైన్‌లు గానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూముల నుంచి గానీ, ఆయన బంధువుల భూముల నుంచి గానీ పోతే ఊరుకుంటారా? అని ప్రశ్నిం చారు. కేసీఆర్‌ చుట్టాలది గానీ, దోస్తులది గానీ ఒక్క ఎకరా భూమి పోయిందా? చూ పెట్టాలన్నారు. తుట్టికి పావు సేరు ధర చెల్లించి రైతులను మోసం చేస్తే చూస్తూ ఊ రుకునేది లేదని మండిపడ్డారు. భూ నిర్వాసితులకు తగిన నష్టపరిహారం చెల్లించే వర కు రైతుల పక్షాన న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులచే రైతులకు జరిగే నష్టంపై మాట్లాడి చట్టప రమైన పోరాటం చేద్దామని హామీ ఇచ్చారు. పోలీసుల నిర్భంధం మధ్య రైతుల సమా వేశం కొనసాగింది. ప్రొఫెసర్‌ కోదండరాం రాకతో రైతుల్లో ఉత్సాహం పెరిగింది. పైప్‌ లైన్‌ నిర్మాణంలో కోల్పోతున్న భూముల రక్షణకు భూ సాధన సమితి, అఖిల పక్షాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వంటా వార్పు కార్యక్రమం పోలీసుల జోక్యంతో వాయి దా పడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగా రెడ్డి, జనసమితి పార్టీ ధర్మపురి, కొరుట్ల నియోజకవర్గాల ఇన్‌చార్జిలు రామగిరి సం తోష్‌, కంతి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌, శంకర్‌, బీజేపీ ధర్మపురి అసెం బ్లీ కన్వీనర్‌ రాంబాబు, కాంగ్రెస్‌ మండలశాఖ అధ్యక్షుడు శైలేంధర్‌రెడ్డి, డెమోక్రటిక్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌, రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు రాజన్న, దళిత లిబరేషన్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కార్యదర్శి సుదర్శన్‌, స్వామి, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-21T05:51:37+05:30 IST