అలవలపాడు ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేస్తున్న ఎంపీ అవినాశ్‌రెడ్డి
ఎత్తిపోతల భూమిపూజలో ఎంపీ
వేంపల్లె, జనవరి 27: ప్రతి ఎకరాకు సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కడప ఎంపీ వైఎస్ అవి నాశ్‌రెడ్డి అన్నారు. అలవలపాడు సమీపంలో ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకానికి గురువారం భూమిపూజ చేశారు. నాగూరు, పెం డ్లూరు, అలవలపాడు చెరువులకు నీరందించి తద్వారా రైతులకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఈ పథకా న్ని ప్రారంభించినట్లు ఆయన తెలి పారు. జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, ఎంపీపీ గాయత్రి, ఉపాధ్యక్షురాలు రమణమ్మ, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్ర ఓబుళరెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.