Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 17 Jan 2022 21:08:30 IST

నాలుగు నెలలుగా బాలిక ప్రవర్తనలో వింత మార్పులు.. ఓ రోజు ఉన్నట్టుండి.. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ..

twitter-iconwatsapp-iconfb-icon
నాలుగు నెలలుగా బాలిక ప్రవర్తనలో వింత మార్పులు.. ఓ రోజు ఉన్నట్టుండి.. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ..

ఇటీవల యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్షల్లో ఫెయిలవడం, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు తదితర కారణాలతో కుంగిపోతున్నారు. ఈ క్రమంలో వారి బలహీనతను కొందరు అవకాశంగా తీసుకుని వివిధ రకాలుగా మోసాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇంకొందరు యువతీయువకులైతే.. మూఢ భక్తికి లోనైపోయి వింత వింతగా ప్రవర్తించడం, చివరకు ప్రాణాలు తీసుకోవడం కూడా చూశాం. కర్ణాటకలో ఇంటర్ చదివిన ఓ బాలికకు వింత కోరిక కలిగింది. నాలుగు నెలలుగా ఆమె ప్రవర్తనలో మార్పులు రావడం కుటుంబ సభ్యులు గమనించారు. ఓ రోజు ఉన్నట్టుండి.. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే..

బెంగళూరు నగరానికి చెందిన అభిషేక్ అనే వ్యక్తికి అనుష్క(17) అనే కుమార్తె ఉంది. ఇంటర్ చదివిన బాలిక నాలుగు నెలలుగా వింత వింతగా ప్రవర్తించడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. ‘‘ఆత్మలకు సంబంధించిన షామనిజం మతం గురించి తెలుసుకుంటున్నాను’’.. అంటూ అప్పుడప్పుడూ తండ్రితో చెప్పేది. అయినా వారు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆమె గత అక్టోబర్ 31న రెండు జతల దుస్తులు, రూ.2500 నగదు తీసుకుంది. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పి వెళ్లిపోయింది. రోజూ ఆత్మల గురించి చెబుతుంటే సరదాగా తీసుకున్న తల్లిదండ్రులు.. చివరకు కూతురు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో షాక్ అయ్యారు.

మాజీ ప్రియుడిపై పోలీసులకు యువతి ఫిర్యాదు.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడ్డ ‘ప్రేయసి’ బండారం!

కూతురి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక షామనిజం మతం వైపు మళ్లేలా ఎవరైనా ప్రోత్సహించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలలుగా ఆమె కోసం గాలిస్తున్నారు. అయినా ఇప్పటికీ బాలిక ఆచూకీ గుర్తించలేకపోయారు. ఏకాంతంగా గడుపుతూ ఆత్మల గురించి మాట్లాడుతుంటే.. గతంలో ఓసారి కౌన్సెలింగ్ ఇప్పించామని బాలిక తండ్రి తెలిపారు. అప్పటి నుంచి తమతో సరిగా మాట్లాడలేదని, కానీ చివరకు ఇలా ఇంటి నుంచి వెళ్లిపోతుందని ఊహించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురును వెతికేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

చికెన్ తెస్తానని వెళ్లి.. సాయంత్రానికి కోటీశ్వరుడయ్యాడు.. దెబ్బకు ఈ పెయింటర్ రాతే మారిపోయింది..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

మూడో కన్నుతో పుట్టిన దూడ.. చూడటానికి ఎగబడుతున్న జనం.. ఇంతకీ ఎక్కడో తెలుసా..videoమొదటి భర్త కంటే రెండో భర్త మేలనుకుంది.. కానీ, అతను కూడా... ఆ రోజు రాత్రి ఫుల్‌గా మందు తాగొచ్చి.. బీకాం విద్యార్థినిని ఆమె తల్లితో సహా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వీళ్లిద్దరూ కలిసి ఏం చేసేవాళ్లంటే..18 ఏళ్ల కూతురు కనిపించడం లేదంటూ ఓ తండ్రి ఫిర్యాదు.. పోలీసులు చెప్పింది విని అంతా షాక్.. మరో యువతితో కలిసి..15 రోజుల క్రితం పెళ్లి.. గంటల తరబడి చాటుగా భార్య ఫోన్ కాల్స్.. నిఘా వేసి భర్త ఇచ్చిన ట్విస్ట్‌తో ఆమెకు మైండ్‌బ్లాంక్..!ఆడ వేషం ధరించి ఆన్‌లైన్‌లో అమ్మాయిలకు వల.. నమ్మకం ఏర్పడగానే ప్రేమ నాటకం.. అశ్లీల ఫొటోలతో..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.