జెండా పుల్లల తయారీలో అటవీశాఖ బిజీబిజీ
ABN , First Publish Date - 2022-07-27T05:25:15+05:30 IST
జెండా పుల్లల తయారీలో అటవీ శాఖ అధికారులు బిజీగా ఉన్నారు.
సీతంపేట: జెండా పుల్లల తయారీలో అటవీ శాఖ అధికారులు బిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి ఆజాదికి అమృత మహోత్సవంలో భాగంగా ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని ఆదేశించారు. దీంతో జెండాకు అవసరమైన వెదురు పుల్లల సేకరణ అటవీశాఖ అధికారులకు అప్పగించారు. పాలకొండ రేంజ్ పరిధిలో రెండు లక్షల వెదురు పుల్లలను సేకరించే పనిలో అటవీ శాఖ సిబ్బంది నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా మంగళవారం జిల్లా అటవీ శాఖాధికారి జి.నరేంద్రన్ ఐటీడీఏ పీవో బి.నవ్యను సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో పలు అంశాలపై చర్చించారు.