మదిని దోస్తున్న మోదుగ పూలు

ABN , First Publish Date - 2021-03-07T05:47:36+05:30 IST

మండలంలో మోదుగ చెట్లు విగరబూసి బాటసారుల మదిని దోచివేస్తున్నాయి.

మదిని దోస్తున్న మోదుగ పూలు
బాలాజీ అనుకోడ- కౌటాల రోడ్డు సమీపంలో మోదుగ పూలు

చింతలమానేపల్లి, మార్చి 6: మండలంలో మోదుగ చెట్లు విగరబూసి బాటసారుల మదిని దోచివేస్తున్నాయి. వేసవి సీజన్‌ వచ్చిందంటే చాలు అన్ని చెట్ల ఆకులు రాల్చి చిగురులతో ఆకుట్టుకోగా మోదుగ చెట్లు మాత్రం విరగబూసిన పూలతో కనువిందు చేస్తున్నాయి. శివరాత్రి, హోలి పండగలకు ఈ పూలు అత్యంత ప్రాధాన్యం. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని చింతల మానేపల్లి మండ లంలోని కర్జెల్లి నుంచి దిందా, గూడెం వరకూ ఉన్న అటవీ ప్రాంతం, బాలా జీ అనుకోడ- కౌటాల వరకు వెళ్లే మట్టిరోడ్డు గుండా ఇరువైపులా కాషాయ రంగులో ఉండి బాటసారుల మదిని దోచుకుంటున్నాయి.

Updated Date - 2021-03-07T05:47:36+05:30 IST