ప్రాజెక్టులకు భారీగా పెరిగిన వరద

ABN , First Publish Date - 2022-08-11T05:24:01+05:30 IST

జిల్లాలో ఉన్న జూరాల, సుంకేసుల జ లాశయాలకు వరద పో టెత్తింది.

ప్రాజెక్టులకు భారీగా పెరిగిన వరద
అయిజ శివారులో నీట మునిగిన పంటలు

- జూరాల 38, సుంకేసుల 27 గేట్లు ఎత్తివేత

- రాజోలి, అయిజ మండలాల్లో నీట మునిగిన పంట పొలాలు 

ధరూరు/రాజోలి, ఆగస్టు 10 : జిల్లాలో ఉన్న   జూరాల, సుంకేసుల  జ లాశయాలకు వరద పో టెత్తింది. జూరాల ప్రాజె క్టుకు భారీగా లక్ష క్యూసె క్కుల మేర నీరు వస్తుం డటంతో అధికారులు 38 గేట్లను ఎత్తి 1,93,111 క్యూసెక్కుల నీటిని దిగు వకు విడుదల చేస్తున్నా రు. దీంతో పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూరాల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.   స్థానికంగా వర్షాలు కూడా భారీగా కురుస్తుండటంతో భీమా నది పరీవాహన ప్రాంత నీరు కూడా జూరాల జలాశయానికి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం  జెన్‌కో జల విద్యుత్‌ కేంద్రానికి 29,996 క్యూసెక్కుల నీటిని విద్యుత్‌ ఉత్పాదనకు  విడుదల చేస్తుండగా, మూడు యూనిట్ల ద్వారా 130 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన అనుసంధానమవుతోంది. దీంతో నెట్టెంపాడు, భీమా లిఫ్ట్‌-2,  కోయిల్‌సాగర్‌ జలాశయాలకు నీటి విడుదల నిలిపివేశారు.  ఎడమ కాల్వ నుంచి 640 క్యూసె క్కులు,  కుడికాల్వకు 578 క్యూసెక్కులు,  సమాంతర కాల్వ నుంచి 150 క్యూసెక్కులు, మొత్తం జలాశయం నుంచి 2,24,420 క్యూసెక్కుల నీటికి దిగువకు విడుదల చేస్తున్న ట్లు  జూరాల అధికారులు ’ఆంధ్రజ్యోతి’ తెలిపారు. అలాగే  రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయానికి   1,58,861  క్యూసెక్కులు వరద నీరు వస్తుండటంతో  13 గేట్లు ఒకమీటరు, 14 గేట్లు రెండు మీటర్లు మొత్తం 27గేట్ల తెరిచి 1,56,766 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సుంకేసుల డ్యాం నీటి సామర్థ్యం 292.00 కాగా, ప్రస్తుతం 290.50 మీటర్లుగా నమోదయింది. నీటి నిల్వ 0.99 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.688 టిఎంసీ ఉందని, కర్నూలు కేసీ కెనాల్‌కు రెండు వేలు క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  తుంగభద్ర డ్యాం నుంచి విడుదల అవుతున్న వరద నీరు వచ్చి చేరడంతో వరద భారీగా పెరిగిందని ఆయన తెలిపారు.  లోతట్టు ప్రాంతాలైన రాజోలి శివారు, తూర్పు గార్లపాడు శివారులోని పంట పొలాలు నీటమునిగాయి. ఈ వరద మరో రెండు రోజులు కొనసాగవచ్చన్నారు.  

 నీట మునిగిన పంట పొలాలు

అయిజ: తుంగభద్రానదికి వరదనీరు బారీగా చేరింది. దాంతో అయిజ మండలంలోని కుటుకనూరు, రాజాపూర్‌, పులికల్‌, కేశవరం, వేణిసోమ్‌పూర్‌ గ్రామాల పరిధిలోని నదీ పరివాహక పంట పొలాలు నీట మునిగాయి. ఇప్పటికే రైతులు వరి నాట్లు వేశారు. అలాగే వేరుశనగ, కంది, పొద్దు తిరుగుడు పంటలు సైతం సాగుచేశారు. వరదనీరు బారీగా పంట పొలాల మీదుగా ప్రవహిస్తుండటంతో మొక్కలు దెబ్బతిన్నాయి. పొలాలు సైతం నీటి కోతకు గురువుతున్నాయి.

Updated Date - 2022-08-11T05:24:01+05:30 IST