నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం
కన్నులపండువగా శివ పార్వతుల కల్యాణం
ఎమ్మిగనూరు, జనవరి 17: ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరుడి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో వరుడు మహాశివుడి తరపున గడిగె కుటుంబానికి చెందిన వారు, వధువు పార్వతీదేవి తరపున బండ కుటుంబానికి చెందిన వారు పెద్దలుగా వ్యవ హరించి వివాహ వేడుకను ఘనంగా జరిపించారు. ఆలయ ధర్మకర్త నాగరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు.