Abn logo
May 14 2021 @ 01:00AM

కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలి

భైంసా క్రైం, మే 13 : కరోనా నేపథ్యంలో నియమ నిబంధనలు పాటిస్తూ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని భైంసా ఏఎస్పీ కిరణ్‌ప్రభాకర్‌ గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అన్నారు. ముస్లింలం దరికీ రంజాన్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడారు. ప్రతి మసీదులో ఐదుగురికి తప్ప ఇతరులకు అనుమతి లేదని చెప్పారు. ముస్లిం సోదరులందరూ మసీదులకు వెళ్లకుండా ప్రతీఒక్కరూ ఇంట్లోనే ప్రార్థన నిర్వహించుకోవాలని చెప్పారు. బంధువులను కలవకుండా, వేరే ప్రాంతాలకు బయటకు వెళ్లకుండా కరోనా నియమ నిబంధనలు పాటించాలని కోరారు. రంజాన్‌ పండుగను ఇంట్లోనే సుఖశాంతులతో జరుపుకోవాలని విన్నవించారు. లాక్‌డౌన్‌ రెండు రోజులుగా తెలంగాణ ప్రాంతంలో విజయవంతంగా నిర్వహించుటకు సహకరించిన ప్రజలకు అభినందనలు తెలిపారు. 

Advertisement