వైభవంగా జ్యోతుల మహోత్సవం

ABN , First Publish Date - 2021-10-26T04:38:00+05:30 IST

మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామంలో చౌడేశ్వరీదేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవం వైభవంగా జరిగింది.

వైభవంగా  జ్యోతుల మహోత్సవం
చౌడేశ్వరిదేవి జ్యోతులను ఊరేగింపుగా తీసుకెళుతున్న దృశ్యం

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 25: మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామంలో చౌడేశ్వరీదేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవం వైభవంగా జరిగింది.  రాత్రి అమ్మవారి ప్రతిరూపమైన జ్యోతులను తయారు చేసి గ్రామంలో ఊరేగింపు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు  చౌడేశ్వరీదేవి అమ్మవారికి జ్యోతుల కమిటీ వారు, ఆలయ కమిటీవారు ఆలయం వద్ద జ్యో తులను  అమ్మవారికి సమర్పించి ఆగం చెల్లించారు.  జ్యోతుల సందర్భంగా  ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మైలవరం పోలీసు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారు.  కాగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని గ్రామంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. 

గొరిగెనూరులో ముగిసిన ఉత్సవాలు

జమ్మలమడుగు మండలంలోని గొరిగెనూరు గ్రామంలో జ్యోతుల మహోత్సవం వైభవంగా ముగిసింది. 24న బిందెసేవ, 25న జ్యోతుల ఉత్సవంతో ఉత ్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా గొరిగెనూరు గ్రామానికి సోమవారం  ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సందర్శించి చౌడేశ్వరీదేవి అమ్మవారికి పూజలు చేసి మొక్కుకున్నారు. 

Updated Date - 2021-10-26T04:38:00+05:30 IST