Abn logo
Sep 18 2020 @ 00:30AM

రైతువేదిక నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి

చెన్నూరు, సెప్టెంబరు 17: గ్రామపంచాయతీల్లో నిర్మిస్తున్న రైతువేదిక  ని ర్మాణాలను యుద్ధప్రాతి పదికన నిర్మించాలని కలె క్టర్‌ భారతి హోళికేరి సం బంధిత అధికారులకు ఆ దేశాలు జారీచేశారు. గు రువారం అంగ్రాజుపల్లి, ఆస్నాద, సోమనపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణాలను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలాఖరు లోపు నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు. తహసీల్దార్‌ జ్యోతి, ఇన్‌చార్జీ ఎంపీడీవో శ్రీధర్‌, పంచాయతీరాజ్‌ ఏఈ శివ, ఎంపీవో బీరయ్య, ఏపీవో గంగాభవానీ, ఏఈవోలు సాగర్‌, రమ్య పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement