Abn logo
Aug 3 2021 @ 00:00AM

అనుమానాస్పదస్థితిలో రైతు మృతి

మృతదేహన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ


ఆమదాలవలస/ రూర ల్‌: మండలంలోని చిట్టివలసకు చెందిన కొరాడ వెంకటరావు (45) అనే రైతు మంగళవారం వేకువజామున అనుమానాస్ప దస్థితిలో మృతిచెందాడు. పోలీ సులు, స్థానికుల కథనం మేరకు... నీరు కట్టేందుకు సోమవారం రాత్రి వెంకటరావు తన పొలానికి వెళ్లాడు. మంగళ వారం పొలం వైపు వెళ్లిన గ్రామస్థులు విగత జీవిగా పడిఉన్న వెంకటరావును గుర్తించారు. దీంతో  కుటుంబ సభ్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ మహేంద్ర, ఇన్‌చార్జి సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ కోటేశ్వరరావులు క్లూస్‌టీమ్‌తో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.  వెంకటరావు  తలపై చిన్నచిన్న గాయాలు ఉండడంతో మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటరావు భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు.