వెలిగొండ ప్రాజెక్టు ఈ ఏడాదే పూర్తి

ABN , First Publish Date - 2022-06-27T06:19:20+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టు నుం చి ఈ ఏడాది సాగునీరు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి సురేష్‌ పేర్కొన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు ఈ ఏడాదే పూర్తి
మాట్లాడుతున్న మంత్రి సురేష్‌

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి సురేష్‌

ఎర్రగొండపాలెం, జూన్‌ 26 :  వెలిగొండ ప్రాజెక్టు నుం చి ఈ ఏడాది సాగునీరు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జరిగిన వైసీపీ ప్లీనరీ సభలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి నాగారునతో పాటు ఆదిమూలపు సురేష్‌ పాల్గొని మాట్లాడారు. ముందుగా సురేష్‌ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. రాష్ట్రపురపాలక పట్టణాభివృద్దిశాఖ  మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. తీగలేరుకు చిన్న కండ్లేరు వరకు పొడగింపు నిర్మాణపు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని అన్నారు. పుల్లలచెరువు మండలం చాపలమడుగు వద్ద 220 కేవి విద్యుత్తు కేంద్రంను త్వరలో శంఖుస్థాపన చేస్తానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామసచివాలయం ఏర్పాటుచేసి వలంటరీ వ్యవస్థ ద్వారా అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ,  ఎస్టీలకు ఉన్న మంత్రి పదవులో 87 శాతం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డే అన్నారు. టీడీపీ మహానాడు సభలో ముఖ్యమంత్రి జగన్‌ను తిట్టడానికి వేదిక చేసుకున్నారని అన్నారు. ముఖ్యఅతిథిగవచ్చిన మంత్రి నాగార్జున  మాట్లాడుతూ  నాడు-నేడు పథకం ద్వారా రాష్ట్రంలో విద్యావిధానంలో సమూలమైన మార్పులు చేశారని దేశంలో మన రాష్ట్రానికి విద్యాశాఖమంత్రిగా సురేష్‌ గుర్తింపు తెచ్చారని అన్నారు. విద్యాదీకుడైన సురేష్‌కు పురపాలక పట్టణాబివృధ్ధిశాఖ మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోను 99 శాతం అమలుజేసి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహాన్‌రెడ్డి నిలుపుకున్నారన్నారు. అందరు ఐకమత్యంగా ఉండి ఆదిమూలపు సురేష్‌ను గెలిపించుకోవాలని అన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా జగన్‌పై విమర్శలు చేయకుండా పార్టీలోని మహిళలు,  ధివ్యాంగులతో విమర్శలు చేయిస్తూ చౌకబారుగా వ్యవహరిస్తున్నారు.  ఈ ఫీనరీ సభలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లాపరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా వైసీపీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే  బుర్రామదుసూధన్‌ యాదవ్‌, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, పార్టీపరీశీలకులు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎర్రగొండపాలెం ఎఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి ఎర్రగొండపాలెం ఎంపీపీ డి కిరణ్‌గౌడ్‌, త్రిపురాంతకం ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, పుల్లలచెరువు ఎంపీపీ లాజరు, దోర్నాల ఎంపీపీ పద్మావతి, పెద్దారవీడు ఎంపీపీ గురవయ్య, పుల్లలచెరువు మండల వైసీపీ అధ్యక్షులు ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఒంగోలుపార్లమెంటు వైసీపీ కార్యదర్శి బి వి సుబ్బారెడ్డి, ఎర్రగొండపాలెం జడ్పీటీసీ చేదూరి విజయబాస్కర్‌,  పెద్దారవీడు జడ్పీటీసీ యేర్వ చలమారెడ్డి,  పుల్లలచెరువు జడ్పీటీసీ వాగ్యానాయక్‌, త్రిపురాంతకం జడ్పీటీసీ జాన్‌పాల్‌, శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ డైరక్టరు యిమ్మడిశెట్టి వెంకటసుబ్బారావు, మండల ఉపాధ్యక్షులు మందుల శేషు,  వైసీపీ అధికారప్రతినిధి నర్రెడ్ల వెంకటరెడ్డి, ఎర్రగొండపాలెం సర్పంచి ఆర్‌ అరుణాబాయ్‌, ఐదుమండలాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T06:19:20+05:30 IST