Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుడ్డు వెరీ గుడ్‌!

కొన్ని పదార్థాల గురించి మనకు కొన్ని అపోహలుంటాయి. అలాంటి వాటిలో గుడ్డు ఒకటి. గుడ్డు మొత్తం తినడం ఆరోగ్యకరమా? తెల్లది తిని పచ్చసొన వదిలేయాలా? గుడ్డును అందరూ తినవచ్చా? 


అపోహ: పచ్చసొన తినకూడదు

వాస్తవం: పచ్చసొన పోషకాల భాండాగారం. ఒక పచ్చసొనలో మెదడుకు ఒక రోజు పోషణకు సరిపడా కోలిన్‌ ఉంటుంది. ఉదయం అల్పాహారంలో గుడ్డు తింటే, దాన్లోని ప్రొటీన్లు, కొవ్వులు మిగతా రోజంతా అవసరానికి మించి తినకుండా మన ఆకలిని నియంత్రించడానికి తోడ్పడతాయి.

 

అపోహ: గుడ్డు గుండెకు చేటు

వాస్తవం: గుడ్డులోని కొలెస్ట్రాల్‌ గుండెకు చేటు అనే అపోహ ఉండేది. కానీ ఆహారంతో దొరికే డైటరీ కొలెస్ట్రాల్‌ రక్తంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను ఏమాత్రం ప్రభావితం చేయలేదని పరిశోధనల్లో తేలింది. నిజానికి గుడ్లలో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌, కొలెస్ట్రాల్‌ అతి తక్కువ పరమాణాల్లో ఉంటాయి. ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఏమాత్రం ఉండవు. కాబట్టి అందరూ గుడ్డులను నిక్షేపంగా తినవచ్చు.


అపోహ: రోజుకు ఒక్క గుడ్డే తినాలి

వాస్తవం: రోజుకు మూడు గుడ్లు తిన్నా ఆరోగ్యానికి ఎటువంటి నష్టం జరగదు. 


అపోహ: గుడ్లు తింటే బరువు పెరుగుతాం

వాస్తవం: గుడ్లలోని ప్రొటీన్‌ బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ప్రొటీన్‌ మెటబాలిజంను పెంచి, ఎక్కువ క్యాలరీలు ఖర్చవడానికి సహాయపడుతుంది. గుడ్డు ఫలితం సంపూర్తిగా పొందాలంటే, పండ్లు, కూరగాయలతో పాటు గుడ్డును ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి. 

Advertisement
Advertisement