విద్యావ్యవస్థ కాషాయీకరణను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2022-06-30T05:55:50+05:30 IST

విద్యావ్యవస్థ కాషాయీకరణను అడ్డుకోవాలి

విద్యావ్యవస్థ కాషాయీకరణను అడ్డుకోవాలి
తలకొండపల్లి: ధర్నాలో మాట్లాడుతున్న చల్లా వంశీచంద్‌రెడ్డి

  • ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి 


తలకొండపల్లి/ఆమనగల్లు/షాద్‌నగర్‌ అర్బన్‌/కేశంపేట/కొందుర్గు/కందుకూరు/ఇబ్రహీంపట్నం/యాచారం, జూన్‌ 29: విద్యావ్యవస్థ కాషాయీకరణను అడ్డుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి పిలుపునిచ్చారు. తలకొండపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం టీఎ్‌సయూటీఎఫ్‌ ఆధ్వర్యంలో పాఠశాలల, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయాలని, సీపీఎ్‌సను రద్దుచేయాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. ఽఈ దర్నాకు వంశీచంద్‌రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్‌ఎ్‌సఎస్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యను కాషాయీకరణ చేయాలన్న బీజేపీ ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టి విద్యారంగాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనలో ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 20రోజులైనా ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలను చేర్చలేదన్నారు. టీచర్లకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌స్కీంను రద్దుచేసి పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే విద్యారంగ, ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ఓపీఎ్‌సను మళ్లీ తీసుకువస్తామని వంశీచంద్‌రెడ్డి తెలిపారు. ఈ ధర్నాలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి భగవంత్‌రాజు, మండల అధ్యక్షుడు జే.ఆంజనేయులు, ప్రధానకార్యదర్శి సురేశ్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యుడు బి.రాములయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జి.మహేశ్‌, మిట్టపల్లి అంజయ్య, దశరథం, అజీం పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు పబ్బతి ఆంజనేయులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల నాయకులు వెంకటాచారి, హరిలాల్‌, లక్ష్మీనారాయణ, రవికుమార్‌, రాంజీ, దేవేందర్‌, వెంకటస్వామి, రాంచందర్‌, ధనలక్ష్మి, పార్వతి, పరమేశ్వరి, సరిత పాల్గొన్నారు. అదేవిధంగా ఫరూఖ్‌నగర్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు బీష్వ కృష్ణయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వీరికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జి.బాల్‌రాజ్‌గౌడ్‌, బాదేపల్లి సిద్దార్థలు మద్దతునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు నర్సింహులు, వెంకటప్ప, బి.సత్యం, ఎల్‌.బాలయ్య, వివిధ సంఘాల నాయకులు తావుర్య, రవీంద్రనాథ్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కేశంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటప్ప ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని తహసీల్దార్‌ మురళీకృష్ణకు అందజేశారు. ఆయన వెంట ఎన్‌.నర్సింలు, శ్యామల, జ్యోతి, కృష్ణయ్య, ప్రసాద్‌, యాదయ్య, జంగయ్య, లక్ష్మన్‌ నాయక్‌, ఆంజనేయులు, జీహెచ్‌ఎం రసూల్‌ ఉన్నారు. అదేవిధంగా కొందుర్గులో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వెంకటయ్య ఉపాధ్యాయులతో కలిసి తహసీల్దార్‌ తౌఫిక్‌ అహ్మాద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో  హనుమంత్‌, ఎండీ ఖలీద్‌, కన్వీనర్‌ ప్రేమ్‌సాగర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా యూటీఎఫ్‌ కందుకూరు మండల అధ్యక్షుడు ఎడ్ల కల్లేష్‌ ఆధ్వర్యంలో కందుకూరు-యాచారం రహదారిపై నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ జ్యోతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నేతలు డాక్టర్‌ జె. బుగ్గరాములు, ఎల్‌.ఈశ్వర్‌, డి.కుమార్‌, ఎస్‌.రవీంద్రకుమార్‌, బి.శేఖర్‌, ఎస్‌.అర్చన, లావణ్య, అంబదాస్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఇ.గాలయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు వై.రామకృష్ణ, ఎల్‌.కిరణ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. వారితో పాటు కె.రవి, కృష్ణకుమారి, జైశ్రీను, ఆనంద్‌కుమార్‌, సుమలత, సుభద్ర, యాదమ్మ ఉన్నారు. అదేవిధంగా యాచారంలో  యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గాల్లయ్య ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయలతో కలిసి ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ సుచరితకు అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు నర్సింహ, జిల్లానాయకులు జగన్నాథం, వెంకటేషం, అంజయ్య,  భాస్కర్‌, దాసు, మోహన్‌, గోపాల్‌, రమేష్‌, జంగయ్య, మోతీలాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:55:50+05:30 IST