Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుక్కలు చింపేశాయ్‌..!

సచివాలయంలో కుక్కలు

తాళం వేసుకుని వెళ్లిన సిబ్బంది

కుర్చీలు, రికార్డుల ఛిద్రం

బి.కోడూరు, నవంబరు 27: సిబ్బంది నిర్లక్ష్యంతో వీధి కుక్కలు సచివాలయంలోని రికార్డులు, కుర్చీలను చింపేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రామసముద్రం సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది కుక్కలు ఆఫీసులో ఉండడం చూసుకోకుండా శుక్రవారం తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. అవి బయటకు వెళ్లేందుకు వీలులేక రాత్రంతా లోపలే ఉండి రికార్డులను, కుర్చీలను ధ్వంసం చేశాయి. విషయం తెలుసుకున్న ఎంపీడీవో ఉమామహేశ్వర్‌రావు గురువారం సచివాలయాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఇందుకు పంచాయతీ సెక్రటరి నాగేంద్ర నిర్లక్ష్య వైఖరి కారణమని తేలుస్తూ అతడికి శనివారం షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ఆఫీసులో ఉన్న కొత్త ఫర్నీచర్‌, రికార్డులను పంచాయతీ సెక్రటరినే సమకూర్చాలని ఎంపీడీవో తెలిపారు. ఈ విషయమై నాగేంద్రను వివరణ కోరగా తాను రెండు పంచాయతీలకు ఇనచార్జ్‌గా ఉన్నందున సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లేంత వరకు ఆఫీసులో ఉండే అవకాశం లేదని అన్నారు. జరిగిన త ప్పిదమంతా సచివాలయ సిబ్బందిదేనని, ఇందులో తన ప్రమేయం లేదన్నారు.

Advertisement
Advertisement