వ్యత్యాసాన్ని వెంటనే సరిచేయాలి

ABN , First Publish Date - 2021-06-13T05:07:58+05:30 IST

గత పీఆర్‌సీలో డైట్‌ లెక్చరర్‌, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2 స్కేల్‌ 35120-87130 ఈ పీఆర్‌సీలో డైట్‌ లెక్చరరల్‌ది 54220-133630గా ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2ది 51320-127310 ఇచ్చారని, ఈ పీఆర్‌సీలో సమాన హోదా కలిగిన ఈ రెండు పోస్టులకు వ్యత్యాసం ఏమిటో అ ర్థం కావడంలేదని, దీనిని సరిచేయాలని రాష్ట్ర కార్యదర్శి రాజ్‌ గంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డైట్‌ లెక్చరర్‌ స్కేల్‌తో, ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌2 స్కేల్‌ స మానం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర తొలి పీఆర్‌సీని 30శాతం ఫిట్మెంట్‌తో ప్రకటించినందుకు, ముఖ్యమంత్రికి తెలంగాణ స్టేట్‌ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

వ్యత్యాసాన్ని వెంటనే సరిచేయాలి

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 12: గత పీఆర్‌సీలో డైట్‌ లెక్చరర్‌, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2 స్కేల్‌ 35120-87130 ఈ పీఆర్‌సీలో డైట్‌ లెక్చరరల్‌ది 54220-133630గా ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2ది 51320-127310 ఇచ్చారని, ఈ పీఆర్‌సీలో సమాన హోదా కలిగిన ఈ రెండు పోస్టులకు వ్యత్యాసం ఏమిటో అ ర్థం కావడంలేదని, దీనిని సరిచేయాలని రాష్ట్ర కార్యదర్శి రాజ్‌ గంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డైట్‌ లెక్చరర్‌ స్కేల్‌తో, ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌2 స్కేల్‌ స మానం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర తొలి పీఆర్‌సీని 30శాతం ఫిట్మెంట్‌తో ప్రకటించినందుకు, ముఖ్యమంత్రికి తెలంగాణ స్టేట్‌ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. సంవత్సరం మానిటరి బెనిఫిట్‌ బకాయిలను ఉద్యోగులు రిటైర్‌ అయిన తర్వాత చెల్లించనున్నట్లు ఉత్త ర్వులు వెలువరించడం సమంజసంగా లేదన్నారు. ఉద్యోగుల మానిటరి బెనిఫిట్‌ సంవత్సరకాలం బకాయిలను జీపీఎఫ్‌/సీపీఎఫ్‌ ఖాతాలలో జమ చేసేలా ఉత్తర్వులు సవరించాలని తెలంగాణ స్టేట్‌ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం తరపున ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు.
పీఆర్‌సీ 2018 జీవోలను సవరించాలి
తెలంగాణ ప్రభుత్వం పీఆర్‌సీ విషయం అమలులో విడుదల చేసిన జీవోల సంఖ్య 51 నుంచి 60 వరకు జీవోలు అసంబద్దంగా ఉన్నాయని, పెన్షనర్లను ఆం దోళనకు గురి చేశాయని డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంతన్‌, జిల్లా బాధ్యులు బాలయ్య, ఆర్‌.రాజన్న ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే కొన్ని జీవోలు సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. 1.4.2020 నుంచి 31.3.2021 వరకు చెల్లించాల్సిన పీఆర్‌సీ బకాయిలు రిటైర్‌ అయిన తర్వాత చెల్లించేవిధంగా జీవో 51 విడుదల చేయడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. పెన్షనర్ల బకాయిలు 36 నెలల వాయిదాలు కాకుండా ఏక మొత్తం ఒకేసారి చెల్లించేవిధంగా జీవో 55ని సవరించాలన్నారు. కనీస పెన్షన్‌ 10,500లుగాఉండాలని, రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 16లక్షలకు బదులు 20లక్షలుగా పెంచుతూ జీవో 56ను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పీఆర్‌సీ జీవోపై పీఆర్‌టీయూ హర్షం
బోధన్‌: తెలంగాణ ప్రభుత్వం పీఆర్‌సీపై జీవో విడుదల చేయడాన్ని హర్షిస్తూ శనివారం పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిం చారు. క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారు 15వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు జరుగనుందని అన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అ ధ్యక్షుడు ఎంబెల్లి శంకర్‌, హర్షద్‌, రాష్ట్ర నాయకులు హన్మంత్‌, రవి, సాయిలు, నా గ్‌నాథ్‌, జిల్లా బాధ్యులు శ్రీనివాస్‌రెడ్డి, ధన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-13T05:07:58+05:30 IST