గిరిజన బాలుడి అదృశ్యం

ABN , First Publish Date - 2020-03-24T12:48:57+05:30 IST

సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామా నికి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన 16ఏళ్ల బాలుడు అదృశ్య మయ్యాడు. సిరికొండ

గిరిజన బాలుడి అదృశ్యం

సిరికొండ, మార్చి23: సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామా నికి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన 16ఏళ్ల బాలుడు అదృశ్య మయ్యాడు. సిరికొండ పోలీసులు, బాలుడి కుటంబ సభ్యుల కథనం.. సుంకిడి గ్రామానికి చెందిన ఆత్రం జలపతిరావు, దైవశీల కుమారుడు జంగు ఇచ్చోడలోని జిల్లాపరిషత్‌ సెకెండరీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.


ప్రతీరోజు ఆటోలో ఇంటి నుంచి ఇచ్చోడకు వెళ్లి చదువుకుంటాడు. గత నెల 29వ తేదీన జంగు తండ్రి జలపతిని పా ఠశాల ప్రధానోపాధ్యాయులు పిలిపించి ‘మీ అబ్బాయి పాఠశాలకు మొబైల్‌ ఫోన్‌ తీసుకొస్తున్నాడని, పాఠాలు సక్రమంగా వినడం లేదని.చదువు పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాడు’ అని తండ్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో తండ్రి ఇంటికి వచ్చాక పాఠశాలకు మొబైల్‌ ఎందుకు తీసుకెల్లావని మందలించాడు. అప్పటి నుంచి జంగు పాఠశాలకు వెళ్లలేదు. ఈనెల 2న పాఠశాలకు ఎందుకు వెల్లడం లేదని తండ్రి మ రోసారి మందలించాడు. దీంతో అదేరోజు రాత్రి నుంచి జంగుతోపాటు తన సైకిల్‌, పుస్తకాల బ్యాగు కనిపించకుండాపోయాయి. చుట్టుపక్క ల గాలించినా ఆచూకీ లభించలేదు. గత నెల 13న మధ్యాహ్నం జలపతి బావమరిదికి మధ్యప్రదేశ్‌ నుంచి ఒకఫోన్‌ కాల్‌ వచ్చింది. ఇ క్కడ ఒక సైకిల్‌ కూడా ఉందని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. దీంతో తన కుమారుడిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి ఉంటారని సిరికొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2020-03-24T12:48:57+05:30 IST