కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి డిజైన్‌ను మార్చాలి

ABN , First Publish Date - 2022-05-18T05:22:03+05:30 IST

కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి డిజైన్‌ను మార్చి ప్రస్తుతం ఉన్న రోడ్డునే హైవేగా మార్చాలని సీపీఐ, సీపీ ఎం, టీజేఎస్‌ అఖిల పక్షం నాయకులు డిమాండ్‌ చేశారు.

కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి డిజైన్‌ను మార్చాలి
కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

- కలెక్టరేట్‌ ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన

- కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 17: కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి డిజైన్‌ను మార్చి ప్రస్తుతం ఉన్న రోడ్డునే హైవేగా మార్చాలని సీపీఐ, సీపీ ఎం, టీజేఎస్‌ అఖిల పక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ, సీపీఎం కార్యదర్శి వర్థం పర్వతాలు, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో అఖిల పక్షం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.  అనంతరం కలెక్టర్‌ పి. ఉద య్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తి, నంద్యాల జాతీయ రహదారి ఏర్పాటులో భాగంగా ఏర్పాటు చేస్తున్న బైపాస్‌ రోడ్డుతో తాడూరు మండల కేంద్రానికి చెందిన 30మంది దళితులు భూములు కోల్పోయే పరిస్థితి నెలకొందని పేర్కొ న్నారు. ప్రభుత్వం తక్షణ మే స్పందించి ప్రస్తుతం ఉన్న రోడ్డునే విస్తరిం చే లా సర్వే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. కా ర్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న, మాలమహానాడు జిల్లా అధికార ప్రతి నిధి బ్యాగరి వెంకటస్వామి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చింత సత్తి, దళిత సం ఘాల నాయకులు భరత్‌, కురుమయ్య, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్మికులకు పీఆర్సీ వర్తింపజేయాలి

 నాగర్‌కర్నూల్‌ టౌన్‌: గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌ డిమాండ్‌  చేశారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏవోకు అందజేశారు.  కార్యక్రమంలో పంచాయతీ కార్మిక యూనియన్‌ జి ల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మహేష్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల రామయ్య, నాయకులు అశోక్‌, కృష్ణయ్య, వెంకట స్వామి, బాలస్వామి, ఆంజనేయులు, చిట్టెమ్మ, కురుమయ్య, కార్మికులు తిరుపతయ్య, రాములు, శ్రీను, బాలస్వామి, కృష్ణయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-18T05:22:03+05:30 IST