Abn logo
Sep 19 2020 @ 00:00AM

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

జైపూర్‌, సెప్టెంబరు 18: మండలం ఇందారంలోని రైల్వే ఫై ఓవర్‌ వద్ద బొమ్మ కిషోర్‌రెడ్డి(25) అనే యువ కుడు శుక్రవా రం అనుమానాస్పదంగా మృతి చెందాడు. నెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన కిషోర్‌రెడ్డి ఇందారం గ్రామానికి చెందిన ప్రేమలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఇందారంలోనే కాపురం పెట్టారు. వారి మధ్య గొడవల కారణంగా భార్య ఇందారంలోనే ఉంటుండగా, కిషోర్‌రెడ్డి పది నెలలుగా ఆవడంలోనే ఉంటున్నాడు.


ఈ క్రమంలో కిషోర్‌రెడ్డి ఇందారంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారుజామున మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.  గొంతుపై గాట్లు ఉండడం వల్ల అతడిని చంపి ఓవర్‌ బ్రిడ్జ్‌ వద్ద పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ భారీ వర్షం కారణంగా గుర్తించలేకపోయాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి తల్లి లక్ష్మి, భార్య ప్రేమలత, పది నెలల కూతురు ఉన్నారు. సంఘటన స్థలాన్ని శ్రీరాంపూర్‌ సీఐ బిల్లా కోటేశ్వర్‌, ఎస్‌ఐ మంగీలాల్‌ సందర్శించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement