వైసీపీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి

ABN , First Publish Date - 2022-09-28T04:43:20+05:30 IST

వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పలికే రోజులు దగ్గరపడ్డాయని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌. రమే్‌షకుమార్‌రెడ్డి హెచ్చరించారు.

వైసీపీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి
మహిళలతో సమస్యలను తెలుసుకుంటున్న రమే్‌షకుమార్‌రెడ్డి

రాయచోటి టీడీపీ ఇన్‌చార్జి రమే్‌ష కుమార్‌రెడ్డి
రామాపురం, సెప్టెంబరు27:
వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పలికే రోజులు దగ్గరపడ్డాయని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌. రమే్‌షకుమార్‌రెడ్డి హెచ్చరించారు. కుమ్మరపల్లె పంచాయతీలో మంగళవారం స్థానిక శ్రేణులతో కలిసి సూరకవాండ్లపల్లె, హరిజనవాడ, దూదేకులపల్లె, నడిగడ్డపల్లె, కుమ్మరపల్లెల్లో నిర్వ హించే బాదుడే బాదుడులో భాగంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి రాయచోటిలో తనను ఎమ్మెల్యేగా, చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రభు త్వం నిరంకుశ పాలనను సాగిస్తోందన్నారు. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు సీఎం కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకున్నారన్నారు. కుమ్మరపల్లె పంచాయతీ నడిగడ్డపల్లెకు చెందిన ధర్మారెడ్డి, రాంమోహన్‌రెడ్డి, నాగషభూషణ్‌రెడ్డి, యోగాంజుల్‌రెడ్డి, మరో 2 కుటుంబాలు మాజీ ఎమ్మె ల్యే రమే్‌షకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. మండ ల నేతలు రాజారెడ్డి, శశిధర్‌రెడ్డి, నాగబసిరెడ్డి, నాగేంద్ర, రామకృష్ణగౌడ్‌, రామిరెడ్డి, కృష్ణారెడ్డి, వేదాంతరెడ్డి, లోక్‌నాధ్‌రెడ్డి, హరి, భాస్కర్‌, చంద్ర, క్రిష్ణ, గోపాల్‌రెడ్డి, రమణ, మారుతీ, తిరుమల, రాజారెడ్డి, రాజ, రఘురామ, నరసింహారెడ్డి, రవి, విశ్వనాధ్‌, బాషా, సురేంద్రారెడ్డి, యాకుబ్‌బాషా, ముబారక్‌, ఖాదర్‌బాషా, ప్రతీ్‌పకుమార్‌రెడ్డి, వినోద్‌, యోగాంజుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం
ఓబులవారిపల్లె, సెప్టెంబరు27: పార్టీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని రైల్వేకోడూరు ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు పేర్కొ న్నారు. వై.కోట, చెన్నరాజుపోడు, ఓబులవారిపల్లె, కొర్లకుంట పంచా యతీల్లో ఇంటింటికీ వెళ్లి వైసీపీ అవలంభిస్తున్న పథకాల్లోని లోపాల ను ఎత్తి చూపుతూ ప్రజలకు వివరించారు. కటికం సునీత, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, రాష్ట్ర బీసీ సెల్‌ నేత  నాగరాజు, మండల నేత చప్పిడి రమేష్‌ బాబు, మండల ఇన్‌చార్జి రమణారెడ్డి, మహిళా నాయకురాలు అనిత దీప్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T04:43:20+05:30 IST