క్రషర్‌ మిల్లును తొలగించాలి

ABN , First Publish Date - 2021-06-22T06:13:15+05:30 IST

మండలకేంద్రంలోని పెద్దగుట్టపై నిబంధలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌ నిర్వహిస్తున్న కేఎస్‌ఎన్నార్‌ స్టోన్‌ క్రషర్‌ను శాశ్వతంగా తొలగించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

క్రషర్‌ మిల్లును తొలగించాలి
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న అఖిలపక్షనాయకులు

ఆత్మకూర్‌(ఎస్‌), జూన్‌ 21: మండలకేంద్రంలోని పెద్దగుట్టపై నిబంధలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌ నిర్వహిస్తున్న కేఎస్‌ఎన్నార్‌ స్టోన్‌ క్రషర్‌ను శాశ్వతంగా తొలగించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. రెవెన్యూ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్‌ 797లో గల 4.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి,  రైతుబంధు పొందుతున్న ఆత్మకూర్‌(ఎస్‌) పీఏసీఎస్‌ చైర్మన్‌ కొణతం సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బ్లాస్టింగ్‌తో ఇళ్లపై రాళ్లు పడి గోడలు బీటలు పడుతున్నాయన్నారు. పంట పొలాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్రషర్‌ మిల్లును తొలగించి న్యా యం చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పందిరి శ్రీని వాస్‌రెడ్డి, వెంకటనర్సింహ్మారెడ్డి, పెదవీరారెడ్డి, పందిరి కృష్ణారెడ్డి, వెంకన్న, రాంరెడ్డి, మాధవరెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T06:13:15+05:30 IST