స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2022-08-14T04:59:06+05:30 IST

స్వాతంత్య్ర ఉద్యమం స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు తెలిపారు.

స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకోవాలి
మాట్లాడుతున్న జిల్లా సీపీఎం కార్యదర్శి శ్రీనివాసులు

రైల్వేకోడూరు, ఆగస్టు 13: స్వాతంత్య్ర ఉద్యమం స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు తెలిపారు. శనివారం రైల్వేకోడూరు లోని ఎన్‌జీవో హోంలో సీపీఎం సీనియర్‌ నాయకుడు లింగాల యానాదయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న దాఖలాలు లేవన్నారు. ఆకలితో పేదలు చనిపోతుంటే బీజేపీ  పెట్టుబడిదారుల రుణాలను మాఫీ చేస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని మతోన్మాదం, పెట్టుబడిదారీ వ్యవస్థల నుంచి దేశాన్ని రక్షించుకోవాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు మోడీ సుబ్బరామయ్య, పందికాళ్ల మణి, ఓబిలి పెంచలయ్య, ఎం. జయరామయ్య, దాసరి జయచంద్ర, పి. మౌలాలి, కేశవులు, నాగిపోగు పెంచలయ్య, కే. రమణయ్య, విజయ్‌, నాని, పుల్లంటి శ్రీనివాసులు, శంకర్‌రాజు, బొజ్జా శివయ్య, మల్లారపు గురయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T04:59:06+05:30 IST