Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ వాటర్ బాటిల్ ఖరీదు అక్షరాలా 45 లక్షల రూపాయలు.. ప్రత్యేకతలు తెలుసుకుంటే అవాక్కవుతారు..!

లక్షల ఖరీదు చేసే మందు బాటిళ్లను చూసుంటాం. ప్రముఖ కంపెనీలకు చెందిన వైన్ బాటిళ్లకు భారీ మొత్తాన్ని వెచ్చించి కొంటూ ఉంటారు. ఎందుకంటే అందులోని మత్తు కోసం అంత మొత్తం వెచ్చిస్తారు. కానీ లక్షల ఖరీదు చేసే వాటర్ బాటిల్‌ని చూశారా.. అందులోనూ రూ.45లక్షలు అంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. ఆ బాటిల్‌లోని నీటిని తాగాలంటే అక్షరాలా నలభై ఐదు లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. మరీ ఇందులోని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.. 

లీటర్ కంటే తక్కువ నీరున్న బాటిల్‌కు లక్షల్లో డిమాండ్ ఉంది. ఇందులో తాగే నీళ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. ఆ నీళ్లను ‘ఆక్వాది క్రిస్టల్లో ట్రిబుటొ అ మొడిగ్లియని’ అని పిలుస్తారు. ఫ్రాన్స్​, ఫిజిల నుంచి ఈ నీటిని తెప్పించారట. సాధారణ నీటి కంటే ఈ నీటిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయట. మరి బాటిల్‌కు కూడా ఓ ప్రత్యేకత ఉంది. 24 క్యారెట్​ల బంగారంతో ఈ బాటిల్‌ని తయారు చేశారట. ఈ బాటిల్‌ని వరల్డ్ ఫేమస్ డిజైనర్​ ఫెర్నాండో అల్టామిరనొ.. డిజైన్​ చేయడం కూడా ఇందులో మరో ప్రత్యేకత. 750 మి.లీ నీటితో ఉన్న ఈ బాటిల్‌ కావాలంటే రూ. 45 లక్షలు ($ 60,000) చెల్లించాల్సిందే.

ఈ బాటిల్ 2010లో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో నమోదైంది. ఇలాంటి రకాల్లోనే తక్కువ ధర బాటిల్ నీరు కావాలంటే $ 285 (రూ.21,355లు) చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ బాటిల్ సాధారణంగా ఉంటుందట. మన దేశంలోనూ సహజ సిద్ధమైన నీటిని నింపిన బాటిళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. కొన్ని బాటిళ్ల ధర రూ.50, రూ.150 మధ్య ఉంటుంది. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా లీటర్‌ రూ.600 విలువ చేసే నీటిని తీసుకోవడం చూశాం. ఈ నీటిని తీసుకోవడం వల్ల ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండొచ్చని విరాట్ తెలిపిన విషయం విదితమే.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement