వైసీపీ పాలనలో రాజ్యాంగం అపహాస్యం

ABN , First Publish Date - 2021-05-17T05:22:39+05:30 IST

వైసీపీ పాలనలో రాజ్యాంగం అపహాస్యమైందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో రాజ్యాంగం అపహాస్యం

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమా


కళ్యాణదుర్గం, మే 16: వైసీపీ పాలనలో రాజ్యాంగం అపహాస్యమైందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈమేరకు ఆయన ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న స్వపక్ష ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసులు బనాయించి, పోలీసులతో చితక బాదించ డం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. లోపాలను సరిదిద్దుకు ని ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. స్వపక్ష ఎంపీకే దిక్కులేకపోతే ఇక సామాన్య ప్రజల దుస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రజా వేధి క కూల్చివేతతో ప్రారంభమైన అరాచక పాలన చివరికి వైసీపీ ఎంపీపై అక్రమ కేసులు బనాయిస్తూ చితకబాది జైలుకు పంపే దౌర్భాగ్య స్థితికి చేరుకుందని దుయ్యబట్టారు. ఇది వరకే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై కర్నూలులో అక్రమ కేసు బనాయించడం అప్రజాస్వా మ్యం కాదా అని నిలదీశారు. కరోనా నేపథ్యంలో ప్రజానీకం అతలకుతలమవుతుంటే పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తుండడం బాధాకరమన్నారు.


రాష్ట్రంలో ఎంపీకే రక్షణ కరువు : ఉన్నం 

వైసీపీ ప్రభుత్వ దౌర్భాగ్య పాలనలో స్వపక్ష ఎంపీ రఘురామకృష్ణరాజు కే రక్షణ కరువైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి ధ్వజమెత్తారు. ఈమేరకు ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సీఎం జగన చేస్తున్న వికృత చేష్టలను ఎత్తిచూపడమే ఎంపీకి శాపంగా మారిందన్నారు. జగన రెండేళ్ల పాలనలో కక్షలు, కార్పణ్యాలు, దోపిడీ, దౌర్జన్యాలు తప్పా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడిందేమిలేదని దుయ్యబట్టారు. ఎంపీపై సీఐడీ పోలీసులు తప్పుడు కేసునమోదు చేసి చితకబాదడం అప్రజాస్వామ్యమన్నారు. రాజ్యంగ హక్కులను ఉల్లంఘిస్తూ పాలకులు ప్రజాద్రోహులుగా తయారవుతున్నారని విమర్శించారు. ఎంపీకే రక్షణలేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమని నిలదీశారు.

Updated Date - 2021-05-17T05:22:39+05:30 IST