రైతు డిక్లరేషన్‌తో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్‌ పార్టీ

ABN , First Publish Date - 2022-05-21T04:59:00+05:30 IST

రైతు డిక్లరేషన్‌తో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్‌ పార్టీ

రైతు డిక్లరేషన్‌తో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్‌ పార్టీ
సమావేశంలో మాట్లాడుతున్న వీర్లపల్లి శంకర్‌

  • నేటి నుంచి రైతు రచ్చబండ కార్యక్రమాలు 


షాద్‌నగర్‌, మే, 20: వరంగల్‌ వేదికగా రాహుల్‌గాంధీ సమక్షంలో విడుదల చేసిన రైతు డిక్లరేషన్‌తో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని  శక్తిగా ఎదిగిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియన్‌ నేత వీర్లపల్లి శంకర్‌ అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ రైతు డిక్లరేషన్‌, విధి, విధానాలను గ్రామ, గ్రామానికి తీసుకువెళ్లడానికి శనివారం నుంచి రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో తిరుగుతూ గడపగడపకు రైతు డిక్లరేషన్‌ గురించి వివరిస్తామని చెప్పారు. పార్టీ అధినేతలు రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ దూసుకెళ్తోందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు రైతులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రెండు పార్టీలు ముమ్మాటికి రైతు ద్రోహిపార్టీలేనని, రైతులపట్ల ముసలి కన్నీరుకారుస్తున్నారని అన్నారు. ధ్యానంకొనుగోలు, నకిలీ విత్తనాలు, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనుంచి రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని డిక్లరేషన్‌లో తాము పొందుపర్చిన అంశాలను ముమ్మాటికి అమలు చేసి తీరుతామని చెప్పారు. అనంతరం టీపీసీసీ మెంబర్‌ బాబర్‌ఖాన్‌తో కలిసి రైతు డిక్లరేషన్‌ బ్రోచర్‌ను వీర్లపల్లి శంకర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో పార్టీ నాయకులు బాలరాజ్‌గౌడ్‌, జగదీష్‌, కృష్ణారెడ్డి, వీరేశం, వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

ప్రతిపౌరుడికీ రైతు డిక్టరేషన్‌ను వివరిస్తాం

కడ్తాల్‌, మే 20: కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ను గ్రామగ్రామాన ప్రతిపౌరుడికీ వివరించేందుకు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి , ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నేనావత్‌ బీక్యానాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు యాట నర్సింహలు తెలిపారు. జూన్‌ 21వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని శనివారం కడ్తాల మండలం పల్లెచెలుక తండాలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కడ్తాల మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రె్‌స్‌ రైతు డిక్లరేషన్‌కు రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. అన్ని గ్రామాలు, తండాల్లో రచ్చబండ సభలను ఏర్పాటుచేసి వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను వివరిస్తామని వెల్లడించారు. సమావేశంలో మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెడెంట్‌ బీచ్యనాయక్‌, ఎంపీటీసీ అద్దాల రాములు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూల శంకర్‌, గౌరవాధ్యక్షుడు రాంచందర్‌ నాయక్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా, నాయకులు వెంకటేశ్‌, లక్ష్మయ్య, మల్లేశ్‌గౌడ్‌, బుచ్చయ్య, యాదయ్య, మంకి శ్రీను, ఇమ్రాన్‌బాబా, జవహార్‌లాల్‌, హీరాసింగ్‌, భాను, కృష్ణ, బాల్‌రాజ్‌, ఎక్భాల్‌పాషా పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T04:59:00+05:30 IST