తహసీల్దార్ శ్రీహరికి వినతిపత్రం అందజేస్తున్న కళాకారులు
ఇచ్ఛాపురం: చింతామణి నాటకం నిషేధంపై తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించి, కళాకారులను ఆదుకోవాలని ఆల్ ఇండియా కళారంగం కళాకారులు కోరారు. మంగళవారం ఇచ్ఛాపురంలో తహసీల్దార్ శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. కరోనా వల్ల రెండేళ్లుగా ఇబ్బందిపడ్డామని, ఈ తరుణంలో చింతామణి నాటకం నిషేధించటం సరికాదన్నారు. కార్యక్రమంలో కళాకారులు ధనంజయరెడ్డి, చిన్నాగురుస్వామి పాల్గొన్నారు.