Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రమాదవశాత్తు బావిలో పడి చిన్నారి మృతి

జహీరాబాద్‌ నవంబరు 26: ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన జహీరాబాద్‌ మండలం హోతి(బీ)లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్నది. జహీరాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ కథనం ప్రకారం కర్ణాటకలోని బీదర్‌ జిల్లాలో గల గుడ్‌పల్లికి చెందిన శివాజీ రాథోడ్‌, సునీత భార్యభర్తలు. వీరు తమ కూతురు ఆశారాణి(8)తో కలిసి పనికోసం కొన్నిరోజుల క్రితం జహీరాబాద్‌లోని చిన్నహైదరాబాద్‌కు వచ్చారు.  శుక్రవారం చెరుకు కొట్టడానికి హోతి (బి)కి తమ కూతురుని వెంట పెట్టుకుని వెళ్లారు. అక్కడ వారు చెరుకు నరికే పనిలో నిమగ్నమై ఉండగా చిన్నారి ఆశారాణి ఆడుకుంటూ సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అక్కడ ఆమె ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతిచెందిందని ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి తండ్రి శివాజీ రాథోడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement
Advertisement