కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-08-10T10:56:45+05:30 IST

కరోనా నే పథ్యంలో లాక్‌డౌన్‌ కార ణంగా ఉపాధి కోల్పోయిన కార్మిక వర్గాలను ఆదుకో వాలని, ప్రతి కుటుంబా నికి రూ.పదివేల ..

కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాలను ఆదుకోవాలి

ఒంగోలు (ప్రగతిభవ న్‌), ఆగస్టు 9: కరోనా నే పథ్యంలో లాక్‌డౌన్‌ కార ణంగా ఉపాధి కోల్పోయిన కార్మిక వర్గాలను ఆదుకో వాలని, ప్రతి కుటుంబానికి రూ.పదివేల సాయా న్ని అందించాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆదివారం కా ర్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరి గాయి. ఈ సందర్భంగా ఒంగోలు నగరం అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో జరిగి న కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కరోనా కల్లోలంలో ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేయకపోగా ప్రజల సొమ్ముతో పెంచిన రైల్వే, ఎల్‌ఐసీ లాంటి సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సేవ్‌ ఇండియా నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. వలస, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలు సం ఘాల నాయకులు అయ్యపరెడ్డి, పీవీఆర్‌.చౌదరి, మోహన్‌, కంకణాల ఆం జనేయులు, పెంట్యాల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T10:56:45+05:30 IST