‘కార్పొరేట్‌’కు కేంద్ర ప్రభుత్వం వత్తాసు

ABN , First Publish Date - 2021-04-13T04:31:58+05:30 IST

దేశంలో కార్పొరేట్‌ సం స్థలకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీపీఎం జి ల్లా కార్యదర్శి ఎండీ జబ్బారు విమర్శించారు.

‘కార్పొరేట్‌’కు కేంద్ర ప్రభుత్వం వత్తాసు
సమావేశంలో మాట్లాడుతున్న ఎండీ. జబ్బారు

- నూతన చట్టాలను రద్దు చేయాలి 

- ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి

- సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బారు

అమరచింత, ఏప్రిల్‌ 12: దేశంలో కార్పొరేట్‌ సం స్థలకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీపీఎం జి ల్లా కార్యదర్శి ఎండీ జబ్బారు విమర్శించారు. సోమ వారం మండలకేంద్రంలోని డీఎంఆర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆ పార్టీ ముఖ్య కా ర్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా జబ్బారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సా మాన్య ప్రజానీకంపై మోయలేని భారం మోపుతు న్నారని విచారం వ్యక్తం చేశారు. రైతాంగానికి వ్యతి రేకంగా కేంద్రం అమలు చేసిన మూడు వ్యవసా యక చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీలో 136రోజు ల నుంచి సమ్మె చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ స్పందించకుండా నిరంకుశత్వంగా పరిపాలన  సా గిస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. అ ర్హులైన పేదలందరికీ డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను మం జూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి జీఎస్‌. గోపి, నాయకు లు వెంకటేష్‌, అజయ్‌, రమేశ్‌, శ్యాంసుందర్‌, రాఘ వేందర్‌, రఘు, బుచ్చన్న, అనంతమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T04:31:58+05:30 IST