మినీ లారీని ఢీకొట్టిన కారు
తలుపుల, మే21: మండ లంలోని కదిరి - పులివెం దుల రహదారి బట్రేపల్లి సమీపంలోని సదానంద ఆ శ్రమం మలుపు వద్ద శని వారం ఆగివున్న మినీ లారీని వెనుకవైపు నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమా దంలో కారులోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. కదిరి నుంచి తలుపులకు మామిడికాయలు తీసుకొని వస్తున్న లారీ సదానంద ఆశ్రమం మలుపు వద్ద ఆగి ఉంది. కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన కుటుంబం కారులో గండి పుణ్యక్షేత్రం వెళుతుండగా మలుపు వద్ద అదుపు తప్పి లారీని ఢీ కొన్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కారులోని వారికి స్వల్పగాయాలైనట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులను అడుగగా ఫిర్యాదు అందలేదన్నారు.