అన్న క్యాంటీన్‌ను వెంటనే తెరిపించాలి

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

పాతగాజువాక- వుడాకాలనీ రోడ్డులోని అన్న క్యాంటీన్‌ను తెరిపించాలని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గురువారం ధర్నా నిర్వహించారు.

అన్న క్యాంటీన్‌ను వెంటనే తెరిపించాలి
ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు

గాజువాక, ఏప్రిల్‌ 15: పాతగాజువాక- వుడాకాలనీ రోడ్డులోని అన్న క్యాంటీన్‌ను తెరిపించాలని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గురువారం ధర్నా నిర్వహించారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్యాంటీన్లను వైసీపీ అధికారంలోనికి వచ్చిన వెంటనే మూయించి పేదల పొట్టకొట్టిందని ఆరోపించారు. టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారన్నారు. 67వవార్డు కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి, ప్రసాదుల శ్రీనివాస్‌, పులి వెంకటరమణారెడ్డి, పెద్దాడ సోమునాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST