నిత్యావసర వస్తువుల పెరుగుదలతో ప్రజలపై భారం

ABN , First Publish Date - 2022-05-18T07:19:51+05:30 IST

గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలో ప్రజలపై మోయలేవని భారం పడిందని సీపీఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు.

నిత్యావసర వస్తువుల పెరుగుదలతో ప్రజలపై భారం
ధరలను తగ్గించాలని రాస్తారోకో చేస్తున్న సీపీఐ నాయకులు

గరిడేపల్లి రూరల్‌, మే 17: గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలో ప్రజలపై మోయలేవని భారం పడిందని సీపీఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు.  పెంచిన ధర లను  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో  కోదాడ, మిర్యాలగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్తులని ్నటినీ ప్రైవేటీకరణ చేస్తూ అదాని, అంబానీలకు లబ్ధి చేకూరుస్తోందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసి దేశాన్ని అప్పుల ఊబిలోకి లాగారని ఆయన అన్నారు. రాష్ట్రంలో  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూములను విలువను పెంచుతూ.. వాటిని విక్రయించి  ఆదాయంతో ప్రభుత్వాన్ని నడిపించే స్థితికి వచ్చిందని,  బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారని ఆయన విమర్శించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు,  ఆసరా ఫించన్లు అందించలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని  డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు త్రిపురం సుధాకర్‌రెడ్డి, బాదె నర్సయ్య, యడ్ల అంజిరెడ్డి, వెంకటరెడ్డి, తిరపయ్య, నాగయ్య, సంజీవరెడ్డి, రంగారెడ్డి, పాపయ్య, దానేలు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-18T07:19:51+05:30 IST