బాస్‌ నిర్ణయమే ఫైనల్‌

ABN , First Publish Date - 2021-09-29T05:47:10+05:30 IST

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మినహా టీఆర్‌ఎ్‌సలో బలమైన ద్వితీయస్థాయి నాయకత్వం లేకపోవడంతో మొన్న నాగార్జునసాగర్‌, తాజాగా హుజురాబాద్‌ లో అభ్యర్థి కోసం వెతకాల్సి వచ్చింది. వీటికి బ్రేక్‌ పడాలంటే క్షేత్రస్థాయి నుంచే పార్టీ పట్టుబిగించాలని అధినేత నిర్ణయించారు.

బాస్‌ నిర్ణయమే ఫైనల్‌

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవులకు పోటాపోటీ

ప్రతీ జిల్లా నుంచి నాలుగు పేర్ల ప్రతిపాదన

తుది నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్‌

ఉమ్మడి జిల్లాలో మొదలైన కమిటీల కసరత్తు

 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మినహా టీఆర్‌ఎ్‌సలో బలమైన ద్వితీయస్థాయి నాయకత్వం లేకపోవడంతో మొన్న నాగార్జునసాగర్‌, తాజాగా హుజురాబాద్‌ లో అభ్యర్థి కోసం వెతకాల్సి వచ్చింది. వీటికి బ్రేక్‌ పడాలంటే క్షేత్రస్థాయి నుంచే పార్టీ పట్టుబిగించాలని అధినేత నిర్ణయించారు. గ్రామ, మండల కమిటీల్లో గులాబీబాస్‌ ఆలోచన అమలుకు ఉమ్మడి జిల్లాలో అవకాశం లేకుండా పోయిం ది. దీంతో జిల్లా అధ్యక్షుల నియామకంలో ఆ పొరపాటు ఉండొద్దనే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త అధ్యక్షుల నాయకత్వంలోనే వెళ్లే అవకాశం ఉండటంతో అన్ని కోణాల్లో అనువైన నేతల కోసం పార్టీ పెద్దలు మంతనాలు ప్రారంభించారు. నాలుగు పేర్లతో జిల్లా నేతలు జాబితా పంపితే సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబరు మొదటి వారంలో పార్టీ జిల్లా సారథుల జాబితా ఖరారు కానుంది.

- (ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..

పదవులు, ఏ గుర్తింపు లేక నిరాశతో ఉన్న పార్టీ నేతలను ఊరడించేందుకు సంస్థాగత నిర్మాణం పేరు తో రెండు నెలల కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత తీసుకున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలు, అనుబంధ సంఘాల ఏర్పాటు, పార్టీ కార్యాలయాల ప్రారంభం, పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడిచిన నేథ్యంలో భారీ బహిరంగ సభ, తదుపరి ఎంపికైన నేతలందరికీ రాజకీ శిక్షణ తరగతుకు షెడ్యూల్‌ ఖరారైంది. అందులో తొలుత గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తయింది. ఈ కమిటీల నిర్మాణంపై సొంత పార్టీ నేతలు, ఇన్‌చార్జీలుగా వెళ్లిన పెద్దలు అంసతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీటీసీగా రెండుమార్లు పోటీ చేసినా గెలవలేని వారిని వరుసగా రెండోసారి మండల అధ్యక్షుడిగా నియమించడం, ఎమ్మెల్యే ఏపార్టీ నుంచి వలస వస్తే ఆపార్టీ నాయకులకే పీఠాలు అప్పజెప్పడం  కనిపించింది. పాత, కొత్త క్యాడర్‌ను మిళితం చేసే ఆలోచనే లేకపోవడం, పాత వారు క్రమంగా కనుమరుగవుతున్నారని స్వయంగా ఆ పార్టీ కమిటీల ఇన్‌చార్జి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త, సమర్ధ నాయకత్వం బయటికివచ్చే అవకాశం ఉంటుందని ఈ నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి ఉండగా, కొత్త తలనొప్పులు ఎందుకు పాత వారినే కొనసాగిద్దామన్న ఆలోచనతో ఎమ్మెల్యేలు ముందుకెళ్లారు. దీంతో 95 శాతం పాతవారికే మండల అధ్యక్ష పదవులు దక్కాయి. పాత వారు తమవల్లకాదంటూ తప్పుకున్న చోటే మార్పులు చోటుచేసుకున్నాయి. నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేంశం పోటాపోటీగా కమిటీలు ఏర్పాటుచేయగా, ఎమ్మెల్యే కమిటీనే ఫైనల్‌ అంటూ జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చింది. మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉండటంతో అక్కడ కమిటీ ఏర్పాటులో జాప్యం చోటుచేసుకుంది.

తెరపైకి పలువురి పేర్లు

సీఎం కేసీఆర్‌ గుర్తింపు పొం దడం, జిల్లాల్లో పార్టీని సమర్థంగా నడపడం, ఎమ్మెల్యే లు, ఇతర నేతలను సమన్వయం చేసుకోవడం వంటి కీలక బాధ్యతలు నెరవేర్చాల్సి న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవి కీలక ంగా మా రింది. మండల కమిటీల నిర్మాణం ముగిసిన నేపథ్యంలో మం త్రి, ఆయా జిల్లాల నేతలు, పార్టీ ఇన్‌చార్జులు భేటీ అయి ప్రతి జిల్లా నుం చి అధ్యక్ష పదవికి నాలుగు పేర్లు పంపాలని అధిష్ఠానం సూచించింది. దీనిపై సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు. నల్లగొండ జిల్లా అధ్యక్ష పదవి రేసులో పలువురు సీనియర్‌ నాయకులు ఉన్నారు. అందులో ప్రఽధానంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, చిట్యాల సింగిల్‌ విండో చైర్మన్‌ సుంకరి మల్లే్‌షగౌడ్‌, ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి చాడ కిషన్‌రెడ్డి టీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినా నెరవేలేదు. నల్లగొండ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి నా దక్కలేదు. ఉద్యమ నాయకుడిగా నల్లగొండకు వచ్చిన సందర్భంలో చాడ ఇంట్లోనే కేసీఆర్‌ బస చేసేవారు. మరోవైపు సంకరి మల్లే్‌షగౌడ్‌ సుదీర్ఘకాలం కాంగ్రె్‌సలో కొనసాగారు. వైఎస్‌ హయాంలో డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీఆర్‌ఎ్‌సలో చేరారు. డీసీసీబీ అధ్యక్ష హామీతో ఆయన చిట్యాల సింగిల్‌ విండో చైర్మన్‌గా బరిలో దిగి గెలుపొందారు. చివరి నిమిషంలో అది చేజారింది. పార్టీ పార్లమెంటరీ సెక్రటరీ కె.కేశవరావుతో మల్లే్‌షగౌడ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక సాగర్‌ ఎన్నికల అనంతరం కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఖాయం అంటూ సీఎం కేసీఆర్‌ రెండుమార్లు బహిరంగ సభల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే తిప్పన పార్టీ ఆవిర్భావ సమయంలోనే అధ్యక్షుడిగా పనిచేశారు. యాదాద్రి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, ఆకుల ప్రభాకర్‌, పడాల శ్రీనివాస్‌, కొలుపుల అమరేందర్‌ పేర్లు చర్చకు వస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో గిడ్డంగులు కార్పొరేషన్‌ చైర్మన్‌ మందు సామేలు పేరు వినిపిస్తోంది. సామాజిక సమీకరణల ప్రకారం నల్లగొండ జనరల్‌, యాదాద్రి బీసీ, సూర్యాపేట ఎస్సీ సామాజిక వర్గాల నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉందన్న చర్చ పార్టీలో నడుస్తోంది. సూర్యాపేట జిల్లాలో మంత్రిదే తుది నిర్ణయం కావడంతో అక్కడ ఆశావహుల పేర్లు పెద్దగా చర్చకు రావడం లేదు.


Updated Date - 2021-09-29T05:47:10+05:30 IST