Abn logo
Mar 2 2021 @ 01:58AM

పెన్నా నదిలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

ఉరవకొండ, మార్చి 1 : మండలంలోని పెన్నహోబిలం సమీపంలోని పెన్నానదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతైన శ్రీధర్‌ (10) మృతదేహం సోమవారం తెల్లవారుజామున లభ్యమైంది. నెరమెట్ల గ్రామానికి చెం దిన వన్నూరుస్వామి, సువర్ణ దం పతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శ్రీధర్‌ ఉన్నారు. శ్రీధర్‌ అదే గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులంతా పెన్నహో బి లం ఏటిగంగమ్మ తిరునాళ్లకు వెళ్లారు. భోజనాలు ముగించుకొని గ్రామానికి తిరిగి వచ్చే సమయంలో శ్రీధర్‌, మరో బాలుడు ఈతకు వెళ్లారు. శ్రీధర్‌ ప్ర మాదవశాత్తు కాలుజారిపడ్డాడు. ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతయ్యాడు. ఈ వి షయాన్ని అతడితో పాటు ఈతకు వెళ్లిన మరోబాలుడు వారి కుటుంబ సభ్యులకు తెలిపాడు. రాత్రంతా గాలించినా బాలుడి ఆచూకీ దొరక్కపోవడంతో నీరు ప్రవహించే ప్రాంతంలో వలను అడ్డంగా కట్టారు. సోమవారం  తెల్లవారుజామున బాలుడి  మృత దేహాన్ని వల వద్ద గుర్తించారు. ఎస్సై ధరణిబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిం చా రు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement