Cyber Crime: కేవలం రూ.10తో కోట్లు వచ్చేస్తాయనే ఆశ.. రూ.27 లక్షలు కోల్పోయిన జైపూర్ వాసి.. ఎలా జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-09-18T22:14:35+05:30 IST

మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడిగా మారిపోయే అరుదైన అవకాశం.

Cyber Crime: కేవలం రూ.10తో కోట్లు వచ్చేస్తాయనే ఆశ.. రూ.27 లక్షలు కోల్పోయిన జైపూర్ వాసి.. ఎలా జరిగిందంటే..

`మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడిగా మారిపోయే అరుదైన అవకాశం. రూ.10తో కోట్లు సంపాదించే ఛాన్స్.. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఆకుపచ్చ లేదా ఎరుపు రంగును ఎంచుకునే ఆటలో పాల్గొనడమే`.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన విజయ్ అనే వ్యక్తికి మూడు నెలల క్రితం టెలిగ్రామ్ యాప్ (Telegram app)ద్వారా వచ్చిన మెసేజ్ ఇది. ఆ గేమ్‌లోకి దిగి మొదట రూ.100 పెట్టుబడి పెట్టి ఆట ఆడిన విజయ్ రూ.3000 గెలుచుకున్నాడు. దాంతో అతనికి ఆశ పెరిగింది. 


ఇది కూడా చదవండి..

Uttar Pradesh: ఏడేళ్ల వయసులో తొలిసారి అత్యాచారం.. 28 ఏళ్ల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ!


క్రమంగా ఆ ఆటకు బానిసగా మారి ఇన్నేళ్లు తను ఎంతో కష్టపడి దాచుకున్న రూ.27 లక్షలను కేవలం మూడు నెలల్లో పోగొట్టుకున్నాడు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. విజయ్ మాత్రమే కాదు.. రాజస్థాన్‌లోనే మరో ప్రాంతానికి చెందిన సచిన్ అనే వ్యక్తి కూడా ఇలాగే గేమ్ ఆడాడు. ఆటలోకి దిగిన 5 నిమిషాల్లో 12 వేలు గెలిచాడు. ఆ తర్వాత 3 నెలల్లో 9 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. చైనాకు చెందిన ఓ గ్యాంగ్ ఈ గేమ్‌ను సృష్టించిందని, టెలిగ్రామ్ ద్వారా గేమ్‌ను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు దోచుకుంటోందని బయటపడింది. 


Reliance Mall, Lulu Mall, Reliance Official, Royal 777, Apple Mall, Ammax Mall, Yesmal Mall, Royal 68, Life Time Sport పేరుతో 20కి పైగా గ్రూపులు టెలిగ్రామ్‌లో ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 3 లక్షల నుంచి 15 లక్షల మంది సభ్యులున్నారు. ఈ గ్రూప్‌ల ద్వారా ఆ గ్యాంగ్ సభ్యులు తమ యాప్‌ను ప్రమోట్ చేస్తారు. గేమ్‌ను ఎలా ఆడాలి, రీఛార్జ్ చేయడం ఎలా, గేమ్ ఆడే పరిస్థితులు ఏమిటి వంటి వివరాలను షేర్ చేస్తారు. గేమ్‌లో దిగిన వారిని ప్రారంభంలో గెలిపిస్తారు. ఆ తర్వాత వారి నుంచి దఫదఫాలుగా డబ్బులు గుంజేస్తారు. కాబట్టి ఆయా యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

Updated Date - 2022-09-18T22:14:35+05:30 IST